News March 23, 2024

HYD: రేషన్ అక్రమాలకు జైలు ఖాయం: మాచన  

image

ప్రజా పంపిణీలో అక్రమాలకు పాల్పడి, మోసం చేయడం నేరం అని పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. శనివారం ఆయన శేరిలింగంపల్లి తారానగర్ చౌక దుకాణంలో జరిగిన అవకతవకల దృష్ట్యా చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. కొందరు డీలర్లు రేషన్ దుకాణాలను ఇష్టారాజ్యం నిర్వహిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.

Similar News

News December 16, 2025

డేంజర్‌లో హైదరాబాద్‌

image

హైదరాబాదులో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్‌కి చేరుకుంది. ఎయిర్ పొల్యూషన్‌, చెత్తాచెదారం, పొగ మంచు, వాహనాల పొగ కారణంగా ఎయిర్ క్వాలిటీ క్షీణిస్తోంది. డబుల్ డిజిట్‌లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ ట్రిపుల్ డిజిట్‌లోకి చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ 220 ఎయిర్ క్వాలిటీ ఉంది. అంటే చాలా మంది జనాలు అనారోగ్య బారిన పడటమే కాకుండా ఆస్తమా వాళ్లకు ప్రాణ ముప్పు ఉంటుంది.

News December 16, 2025

HYD: భగత్‌సింగ్ వీలునామా.. విప్లవానికి అక్షరనామా

image

‘భగత్‌సింగ్ వీలునామా’ నవల స్వాతంత్ర్య సమరయోధుడి ఆలోచనా, త్యాగస్ఫూర్తిని గుండెను తాకేలా ఆవిష్కరిస్తుంది. విప్లవం ఆయుధాలతోనే కాదు, ఆలోచనలతోనూ సాగుతుందన్న సత్యాన్ని బలంగా చాటిందీ పుస్తకం. భగత్‌సింగ్ ఆశయాలు, సమాజ మార్పుపై ఆయన కలలు ప్రతి పుటలో ప్రతిధ్వనిస్తాయి. యువతను ఆలోచింపజేసే ఈ రచన, దేశభక్తికి కొత్త నిర్వచనం చెబుతుంది. పాఠకుడిని లోతైన ఆలోచనలోకి నెట్టే బాధ్యతాయుత రచన. అందరూ చదవాల్సిన నవల ఇది.

News December 16, 2025

GHMC డీలిమిటేషన్‌.. నేడు స్పెషల్‌ కౌన్సిల్‌ మీట్

image

GHMC డీలిమిటేషన్‌‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఎవరిని సంప్రదించి వార్డులు పెంచారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయితే, ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఇవ్వాలని GHMC వారం రోజుల గడువు ఇవ్వగా వెయ్యికిపైగా ఆబ్లిగేషన్స్ వచ్చాయి. వీటిపై చర్చించేందుకు నేడు బల్దియా స్పెషల్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేసింది. ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు పాలకవర్గం సమాధానం ఇవ్వనుంది. ఫైనల్‌ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.