News May 24, 2024
HYD: లింక్ క్లిక్ చేశాడు.. రూ.5.60 లక్షలు స్వాహా
స్టాక్ మార్కెట్ పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.5.60 లక్షలు టోకరా వేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి.. స్టాక్ మార్కెట్‌లో లాభాలు వచ్చేలా పెట్టుబడి పెట్టిస్తామని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ప్రకటన చూశాడు. లింక్‌పై క్లిక్ చేయగా ఓ టెలిగ్రామ్ గ్రూప్‌లో యాడ్ అయ్యాడు. మొదట కొంత పెట్టుబడి పెట్టగా..లాభాలు వచ్చాయి. దీంతో విడతలవారీగా రూ.5.60 లక్షలు పెట్టి మోసపోయి CCSలో ఫిర్యాదు చేశాడు.
Similar News
News November 11, 2024
నేడు HYDలో వాటర్ బంద్
రాజధాని వాసులకు ముఖ్య గమనిక. నేడు నగరంలోని పలు ఏరియాల్లో నీటి సరఫరా ఉండదు. వాటర్ పైప్‌లైన్ మరమ్మతుల దృష్ట్యా ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 వరకు వాటర్ సప్లై నిలిపివేస్తున్నారు. అమీర్‌పేట్, SRనగర్, ఎర్రగడ్డ, మూసాపేట, కూకట్‌పల్లి, KPHB, RCపురం, లింగంపల్లి, మియాపూర్, మదీనాగూడ, అమీన్‌పూర్, జగద్గిరిగుట్ట ఏరియాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు. SHARE IT
News November 11, 2024
HYD: పోచమ్మ గుడి వద్ద మహాతాండవం ఆడుతా: అఘోరీ
శంషాబాద్‌లో ధ్వంసమైన పోచమ్మ గుడి వద్ద తాను మహాతాండవం ఆడబోతున్నట్లు అఘోరి తెలిపారు. గుంటూరు జిల్లాలోని కోటప్ప స్వామి ఆలయం వద్ద ఆమె మాట్లాడుతూ.. స్త్రీ శక్తి బయటకు వస్తే ఎవరూ తట్టుకోలేరన్నారు. ఆడపిల్లలపై అఘాయిత్యానికి పాల్పడితే మగాళ్ల మర్మాంగాన్ని కోసేస్తానని హెచ్చరించారు. మహిళల కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేయడానికి సిద్ధమని పేర్కొన్నారు.
News November 10, 2024
HYD: వీడియోలు తీసి షేర్ చేయడం ఏంటి?: చక్రపాణి
HYDలో ఎన్యుమరేటర్లు ఇంటింటికీ కులగణన సర్వే చేస్తున్నారు. కాగా.. కొంత మంది సర్వేపై విమర్శలు చేస్తూ మహిళల వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీనిపై TSPSC మాజీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి X వేదికగా స్పందించారు. ‘వారు పార్టీ కార్యకర్తలు కాదు. వారు ఉద్యోగులు. వీడియోలు తీయడం చట్టరీత్యా నేరం. DGP చర్యలు తీసుకోవాలి. విమర్శించాలనుకుంటే డైరెక్ట్‌గా మీరే ఓ వీడియో తీసి పోస్ట్ చేయాలి’ అని సూచించారు.