News October 14, 2024

HYD: విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: ఈటల

image

సికింద్రాబాద్‌లో <<14353764>>ముత్యాలమ్మ విగ్రహాన్ని<<>> ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని BJP మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదన్నారు. దాడిచేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యక్తులు, శక్తులపట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని.. లేదంటే జరిగే పరిణామాలకు రేవంత్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Similar News

News October 15, 2024

HYD: ‘అబ్దుల్ కలాం’ అవార్డుకు వేమూరి దంపతుల ఎంపిక

image

ప్రముఖ కవి, గాయకుడు వేమూరి అనంత రామకృష్ణశర్మ, ప్రముఖ లలిత సంగీత, సీని గాయని వేమూరి మంజుల దంపతులు భారతరత్న డా. APJ అబ్దుల్ కలాం అవార్డుకు ఎంపికయ్యారు. సంగీతం, సాహిత్య రంగంలో విశేష కృషి చేస్తున్న వేమూరి దంపతులకు ఈరోజు పినాకిని సంస్థ ఆధ్వర్యంలో HYD త్యాగరాయగానసభలో అవార్డు ప్రదానం చేయనున్నారు. MLC మధుసూదనాచారి, సీల్‌వెల్ కార్పొరేషన్ CMD బండారు సుబ్బారావు తదితరులు హాజరుకానున్నారు.

News October 15, 2024

HYD: విడాకులు తీసుకున్నా.. కలిసే మోసాలు

image

దంపతులు విడాకులు తీసుకున్నా.. కలిసే మోసాలు చేస్తూ పోలీసులకు చిక్కారు. పోలీసులు తెలిపిన వివరాలు.. కర్ణాటకకు చెందిన మహ్మద్, రేష్మ HYDకు వచ్చి జాబ్ కన్సల్టెన్సీలో పనికి కుదిరారు. 2013లో వివాహం చేసుకున్నారు. తర్వాత విడాకులు తీసుకున్నా.. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు దిగారు. ఆమె మరో పెళ్లి చేసుకున్నా మోసాలు చేస్తూ పట్టుబడ్డారు. కేసు నమెదు చేసి ఫోన్లు, ల్యాప్‌టాప్, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

News October 15, 2024

HYD: ఈ నెల 22న కలెక్టరేట్‌ల ముట్టడికి పిలుపు

image

విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22వ తేదీన జిల్లా కలెక్టరేట్‌లు, మండల తహశీల్దార్ కార్యాలయాలను ముట్టడించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. సోమవారం కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణతో కలిసి సమావేశమయ్యారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ తక్షణమే విడుదల చేయాలన్నారు.