News June 10, 2024
HYD: వేతనాల పెంపునకు కృషి చేస్తా: మంత్రి సీతక్క
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు, సవాళ్లు అనే అంశంపై ఈరోజు HYD సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర సదస్సులో రాష్ట్ర పంచాయితీరాజ్ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం వ్యవసాయానికి అనుసంధానం, పనిదినాలను పెంచి కూలీలకు వేతనాలు పెంపునకు కృషి చేస్తామన్నారు. ఉపాధి కూలీలకు మౌలిక సధుపాయాలు కల్పించేలా కృషి చేస్తామన్నారు.
Similar News
News November 11, 2024
ఆర్టీసీ ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్
ప్రయాణికులకు ఆర్టీసీ సేవలు సులువుగా అందించేందుకు టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో బస్‌పాస్ ఉన్నవారు తమ బస్‌పాస్‌తో ఏసీ సర్వీసుల్లో ప్రయాణిస్తే టికెట్‌లో 10% డిస్కౌంట్ ఉంటుందని తెలిపింది. జనవరి 30వ తేదీ వరకు ఈ రాయితీ అందుబాటులో ఉంటుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News November 11, 2024
HYDలో విషాదం.. గుండెపోటుతో గుడిలో మృతి
HYDలో విషాదం ఘటన వెలుగుచూసింది. KPHBలోని ఆంజనేయస్వామి గుడిలో విష్ణువర్ధన్(31) చనిపోయాడు. ఉదయం ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కింద పడిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న భక్తులు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోవడంతో మృతి చెందాడు. KPHB పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
News November 11, 2024
హైదరాబాద్‌లో పెరిగిన చలి!
హైదరాబాద్‌లో రోజు రోజుకు చలి పెరుగుతోంది. ఉదయం చాలాచోట్ల పొగమంచు కురుస్తోంది. పటాన్‌చెరు, హయత్‌నగర్, బేగంపేట, దుండిగల్, రాజేంద్రనగర్, ముషీరాబాద్, ఓయూలో 16 డిగ్రీల నుంచి 20 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు తగ్గాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే కోఠి, సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్, అబిడ్స్ వంటి ఏరియాల్లో స్వెట్టర్ల దుకాణాలకు గిరాకీ పెరిగింది.