News March 14, 2025
HYD: వైన్స్ బంద్.. తాటికల్లుకు ఎగబడ్డ జనం

హోలీ సందర్భంగా శుక్రవారం ప్రభుత్వం వైన్స్‌లను మూసివేసింది. మందుబాబులకు చుక్క మందు లేదు. దీంతో మత్తు కోసం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించారు. ప్రకృతి ప్రసాదించిన తాటికల్లు కోసం క్యూ కట్టారు. తెల్లవారుజామునే ప్రతాపసింగారం సహా నగర శివార్లలో క్యాన్లు, బాటిళ్లతో బారులు తీరారు. గిరాకీ ఊహించని స్థాయికి చేరుకోవడంతో గీత కార్మికుల కళ్లల్లో ఆనందపు వెలుగులు మెరిశాయి.
Similar News
News March 15, 2025
HYD: హత్య కేసును ఛేదించిన పోలీసులు

షాబాద్‌లోని శ్రీదుర్గా వైన్స్‌లో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. పోలీసుల వివరాలు.. వికారాబాద్ జిల్లాకు చెందిన నరేందర్ సీతారాంపూర్‌లో ఉంటున్నాడు. వైన్స్ ప్రహరీ దూకి చోరీకి యత్నించాడు. శబ్దం రావడంతో అక్కడే నిద్రిస్తున్న బిక్షపతి బయటకు వచ్చాడు. దొరికిపోతానని భయపడి రాడ్డుతో భిక్షపతి తలపై మోదగా అతను మృతి చెందాడు. ఈ కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు నరేందర్‌ను రిమాండ్‌కు తరలించారు.
News March 15, 2025
HYD: హోలీ ఈవెంట్‌లో గొడవ.. యువకుడిపై కత్తిపోట్లు

పోచారం ఐటీ కారిడార్‌లో జరిగిన గొడవ దాడికి దారితీసింది. బాధితుడి వివరాలిలా.. హొలీ ఈవెంట్‌లో ఉప్పు ఆదిత్య అనే యువకుడితో కొంతమందికి గొడవ జరిగింది. అనంతరం అతను బొడుప్పల్ వెళ్తూ నారపల్లి వద్ద ఆగాడు. బైక్‌పై వచ్చిన యువకులు కత్తితో దాడి చేశారు. అతణ్ని ఉప్పల్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
News March 14, 2025
బాలకృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కార్

HYDలోని జూబ్లీహిల్స్ రోడ్డు నెం.1లో నటుడు బాలకృష్ణ ఇంటి ముందున్న ఫుట్‌పాత్‌పైకి ఓ కారు దూసుకెళ్లింది. అతివేగంతో బాలకృష్ణ ఇంటి ముందున్న ఫెన్సింగ్‌ను కారు ఢీకొట్టింది. మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్డు నెం.45 మీదుగా చెక్ పోస్ట్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఫెన్సింగ్‌తో పాటు కారు ముందు భాగం ధ్వంసమైంది. కాగా.. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.