News March 16, 2025
HYD: శ్రీరాములు పేరిట తెలుగు విశ్వవిద్యాలయం

తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు పేరును HYDలోని తెలుగు విశ్వవిద్యాలయానికి నామకరణం చేశారు. 1985లో DEC 2న నాటి CM NTR ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. తర్వాత దీనికి 1998లో అమరజీవి పేరు పెట్టారు. కూచిపూడిలోని సిద్దేంద్ర కళాక్షేత్రాన్ని విశ్వవిద్యాలయంలో విలీనం చేశారు. తెలుగు ప్రజల కోసం ఆత్మబలిదానం చేసిన ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుందాం.
Similar News
News March 16, 2025
మహారాణా ప్రతాప్ సింగ్ వారసుడు కన్నుమూత

రాజవంశీకుడు మహారాణా ప్రతాప్ సింగ్ వారసుడు అర్వింద్ సింగ్ మేవార్ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ రాజస్థాన్‌లోని సిటీ ప్యాలెస్‌లో చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రంజీల్లో రాజస్థాన్ కెప్టెన్‌గా వ్యవహరించారు. పూర్వీకుల ఆస్తులపై న్యాయపోరాటం చేస్తూ మేవార్ ఫ్యామిలీ ఇటీవల వార్తల్లో నిలిచింది. రేపు అర్వింద్ సింగ్ అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.
News March 16, 2025
మెట్రోలో బెట్టింగ్ యాడ్స్ మాటేంటి సార్..!

HYD మెట్రోలో బెట్టింగ్ యాప్స్ యాడ్‌లు తీవ్ర వివాదాని దారితీశాయి. HML ఎండీ NVS రెడ్డికి బెట్టింగ్ యాప్స్‌లపై ఫిర్యాదులు చేసినా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ గ్రేటర్ HYD ఎస్సీ సెల్ కన్వీనర్ తోటకూర శ్రీకాంత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మరి మెట్రోలో బెట్టింగ్ యాడ్స్ మాటేంటి సార్ అని అధికారులను ప్రశ్నించారు. వీటితో ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయని, యాప్స్‌ను నమ్మి మోసపోవద్దని అన్నారు.
News March 16, 2025
భోజనం చేసే విధానం ఇదే: సద్గురు

రోజువారీ ఆహారపు అలవాట్లపై ఆథ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీవాసుదేవ్ కొన్ని సూచనలు చేశారు. నేలపై కూర్చుని పద్మాసనం వేసుకుని తినాలి. చేత్తో తింటేనే మనం ఏం తింటున్నామో తెలుస్తుంది. తినేటప్పుడు 24 సార్లు నమలాలి. తినే ముందు కనీసం 2 నిమిషాలు ఆగితే ఇష్టంగా తింటాం. 35 ఏళ్లు దాటినవారు ఎంతకావాలో అంతే తీసుకోవాలి. వీరు రోజుకు రెండు సార్లు తినాలి. ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు. తినేటప్పుడు మాట్లాడకూడదు.