News February 6, 2025
HYD: షాకింగ్.. కిడ్నాప్ వెనుక ACP
హైదరాబాద్‌లో ఓ ACPపై సస్పెన్షన్ వేటు పడిన వ్యవహారం ఆలస్యంగా వెలుగుచూసింది. శంకర్పల్లి మోకిల ప్రాంతంలో ఏడాది కిందట జరిగిన కిడ్నాప్ కేసులో దర్యాప్తులో విస్తుపోయే విషయాలు బయటకి వచ్చాయి. నిందితులకు బాధితుడి లొకేషన్ షేర్ చేసి కిడ్నాప్‌కు సహకరించింది ఏసీపీ అని తేలడంతో పోలీస్ ఉన్నతాధికారులు కన్నెర్ర చేశారు. ఛార్జ్ షీట్లో నిందితుల జాబితాలో సదరు ఏసీపీ పేరు చేర్చి ఆయనను సస్పెండ్ చేశారు.
Similar News
News February 6, 2025
పెద్దఅంబర్‌పేట్‌లో స్కూల్ బస్సు కింద పడి పసిపాప మృతి
పెద్దఅంబర్‌పేట్‌లో విషాదం నెలకొంది. స్కూల్ బస్సు కింద పడి 4 ఏళ్ల బాలిక మృతి చెందింది. స్థానికుల ప్రకారం.. హయత్‌నగర్ శ్రీచైతన్య టెక్నో స్కూల్లో రిత్విక LKG చదువుతోంది. స్కూల్ అయ్యాక బస్సు దిగి వెళ్తుండగా ఒక్కసారిగా బస్సు రివర్స్ తీయడంతో ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే పసిపాప బస్సు కింద పడి నలిగిపోయిందని వారు వాపోయారు.
News February 6, 2025
శంషాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు.. క్లారిటీ
శంషాబాద్‌లో కూల్చివేతలపై హైడ్రా క్లారిటీ ఇచ్చింది. రాళ్లగూడ విలేజ్ వద్ద ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డుకు వెళ్లే దారి లేకుండా 55 మీటర్ల మేర ప్రహరీ నిర్మించారు. సర్వీసు రోడ్డుకు వెళ్లే దారి లేకుండా చేశారని రాళ్లగూడ విలేజ్ పరిసర ప్రాంతాల లేఔట్ల నివాసితులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
News February 6, 2025
సికింద్రాబాద్: మెట్టుగూడలో దారుణం
సికింద్రాబాద్ మెట్టుగూడలో దారుణ ఘటన వెలుగుచూసింది. చిలకలగూడ పీఎస్ పరిధిలో నివాసం ఉంటున్న రేణుక(55), ఆమె కుమారుడు యశ్వంత్ (30)పై ఐదుగురు దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో తల్లి కుమారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.