News January 10, 2025
HYD: సంక్రాంతి పండుగ సందర్భంగా రాచకొండ సీపీ సూచనలు
రాచకొండ CP సుధీర్ బాబు సూచనల మేరకు సంక్రాంతి పండగ సందర్భంగా ప్రజల ఆస్తి రక్షణకు చిట్కాలను విడుదల చేశారు. ప్రజలు తమ విలువైన వస్తువులు బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలి. ఇంటిలో CC కెమెరాలు, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, అలారమ్ వ్యవస్థలు అమర్చుకోవాలి. అల్మారాలు, లాకర్ల తాళాలు కనిపించని ప్రదేశాల్లో దాచాలి. ఇంట్లో కొన్ని లైట్లు ఆన్లో ఉంచడం ద్వారా దొంగతనాలను నివారించవచ్చని CP తెలిపారు.
Similar News
News January 10, 2025
HYD: 2030 నాటికి 10వేల ఛార్జింగ్ స్టేషన్లు..50% అక్కడే!
2030 నాటికి 10వేల EV ఛార్జింగ్ స్టేషన్లను తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా వీటికోసం ప్రణాళికలు సిద్ధం చేయగా, దాదాపు 50% హైదరాబాద్ మహానగరంలోనే ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. 2024 నవంబర్ నెలలో నూతనంగా తెచ్చిన ఈవీ పాలసీ మేలు చేయనుంది. మరోవైపు HYD నగరంలో మొత్తం ఎలక్ట్రికల్ ఆర్టీసీ బస్సులను తేవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
News January 10, 2025
HYD: సంక్రాంతికి 6,432 ప్రత్యేక బస్సులు: మంత్రి
సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ప్రజల సౌకర్యార్థం 6,432 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రత్యేక బస్సులు నేటి నుంచి నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులకు అవసరమైతే ఆర్టీసీ మరిన్ని బస్సులు నడపడానికి సిద్ధంగా ఉందని ఆర్టీసీ అధికారులు ప్రతి మేజర్ బస్‌స్టేషన్ వద్ద ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.
News January 10, 2025
HYD: ‘ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం’
వైకుంఠ ఏకాదశి వేడుకలను అన్ని ఆలయాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. కాగా మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాల లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్‌కు భక్తులు పోటెత్తారు. ‘ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం’ మంత్రం పఠిస్తూ భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రాజధాని ప్రజలు పెద్ద ఎత్తున చీర్యాలకు క్యూ కట్టారు. దీంతో ECIL-నాగారం-రాంపల్లి చౌరస్తా- చీర్యాల రూట్‌లో వాహనాల రద్దీ నెలకొంది. SHARE IT