News January 1, 2025
HYD: సీఎంను కలిసిన మంత్రులు, MLAలు, MPలు
జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలోని సీఎం రేవంత్ రెడ్డిని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు కిరణ్ రెడ్డి, అనిల్ కుమార్, మల్లు రవి, ఎమ్మెల్యేలు, అద్దంకి దయాకర్ , కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.
Similar News
News January 6, 2025
హైదరాబాద్ జిల్లా కనిష్ఠ ఉష్ణోగ్రతలు
హైదరాబాద్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో వెస్ట్ మారేడ్‌పల్లిలో 13.3, సులేమాన్ నగర్ 13.6, గోల్కొండ 13.9, కంటోన్మెంట్ 14, షేక్‌పేట 14.2, మోండామార్కెట్ 14.4, లంగర్‌హౌస్ 14.6, ముషీరాబాద్ 14.8, రియాసత్‌నగర్ 14.8, చాంద్రయాణ గుట్ట 14.9, ఆసిఫ్‌నగర్‌లో 14.9℃గా నమోదైంది. కాగా ఈ ప్రాంతాలన్నింటికి వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
News January 6, 2025
చర్లపల్లి టర్మినల్ సేవలకు ఇదే కీలకం..!
చర్లపల్లి రైల్వే టర్మినల్ చుట్టూ చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. ఆయా ప్రాంతాల్లో పదేపదే అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. కిక్కిరిసిన రోడ్లతో ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అద్భుతంగా నిర్మించిన చర్లపల్లి టర్మినల్, మెరుగైన సేవలు అందించాలంటే, చుట్టూ ఉన్న రోడ్ల అభివృద్ధితో పాటు, భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
News January 5, 2025
HYDలో పరిగి కానిస్టేబుల్ సూసైడ్
HYDలో మరో కానిస్టేబుల్ సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. ఆదివారం HYD అంబర్‌పేటలోని తన నివాసంలో భాను శంకర్ ఉరి వేసుకున్నాడు. అయితే, భానుశంకర్ వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. గత వారం వ్యవధిలోనే ముగ్గురు పోలీసులు HYDలోనే సూసైడ్ చేసుకోవడం గమనార్హం. అయితే, భాను శంకర్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.