News January 8, 2025

HYD: హామీలు అడిగినందుకు అక్రమ కేసులు: హరీష్ రావు

image

కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా.. అడిగినందుకు అక్రమ కేసులు పెడుతున్నారని మాజీమంత్రి హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో డైరీ ఆవిష్కరణలు ఉద్యమ కేంద్రాలుగా నిలిచాయని, ఉద్యమకాలం నాటి జ్ఞాపకాలు డైరీలో ఉన్నాయని అన్నారు.

Similar News

News January 9, 2025

ఓయూలో ఏడుగురికి అసిస్టెంట్ రిజిస్ట్రార్‌లుగా పదోన్నతి

image

ఉస్మానియా యూనివర్సిటీ పనిచేస్తున్న ఏడుగురు ఆఫీస్ సూపరింటెండెంట్లను అసిస్టెంట్ రిజిస్ట్రార్ (ఏఆర్)లుగా, ఒక ఏఆర్‌కు డిప్యూటీ రిజిస్ట్రార్‌గా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు వారికి ఓయూ వీసీ ప్రొఫెసర్ ఎం.కుమార్ నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేశ్ రెడ్డి, ఓఎస్డీ ప్రొఫెసర్ జితేందర్ కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

News January 9, 2025

ఓయూ అధ్యాపకుల ప్రమోషన్లకు నోటిఫికేషన్ విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులకు కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ (సీఏఎస్) కింద పదోన్నతులు కల్పించేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉన్న అధ్యాపకులు ఈ నెల 25వ తేదీలోగా సంబంధిత ధ్రువపత్రాలతో కలిసి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీంతో అసిస్టెంట్ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లుగా, అసోసియేట్ ప్రొఫెసర్లు సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందేందుకు అవకాశం ఉంటుంది.

News January 9, 2025

21వ తేదీ నుంచి ఎంబీఏ కోర్సుల పరీక్షలు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ ఎంబీఏ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ శశికాంత్ తెలిపారు. ఎంబీఏ (సీబీసీఎస్), ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్), ఎంబీఏ (టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్) తదితర కోర్సుల మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఈ నెల 21వ తేదీ నుంచి, ఎంబీఏ (ఈవినింగ్) అయిదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఈ నెల 25వ తేదీ నుంచి నిర్వహించనున్నామన్నారు.