News July 27, 2024
HYD: హైటెక్‌సిటీని అమ్మేవారు: డిప్యూటీ సీఎం
కాంగ్రెస్ ముందుచూపుతోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని డిప్యూటీ CM మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ECIL, NFC వంటి కేంద్ర సంస్థలు, అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రోను తీసుకొచ్చామన్నారు. ఇప్పుడు కూడా రూ. 10 వేల కోట్ల నిధులు కేటాయించినట్లు ఆయన గుర్తుచేశారు. BRS చేసిందేమీ లేదన్నారు. చాలా వరకు అమ్ముకున్నారని.. వదిలేస్తే హైటెక్‌సిటీని అమ్మేవారని భట్టి మండిపడ్డారు.
Similar News
News November 28, 2024
HYD: కాంగ్రెస్‌ను బద్నాం చేద్దామని BRS ప్లాన్: కల్వ సుజాత
BRSవాళ్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేద్దామని పక్కా ప్లాన్ వేసుకున్నారని తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ కల్వ సుజాత మండిపడ్డారు. ఈరోజు HYDగాంధీభవన్‌లో ఆమె మాట్లాడుతూ..గురుకులంలో గంట ముందు తిన్న పిల్లలు బాగున్నారని, తర్వాత అదే అన్నం తిన్న విద్యార్థులకు మాత్రం ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు.‘రాజకీయం కోసం పసి పిల్లలను బలి తీసుకునే వెధవలు BRSవాళ్లు’ అని ఫైర్ అయ్యారు.
News November 28, 2024
HYDకు వచ్చిన డేంజర్ గ్యాంగ్.. పోలీసుల క్లారిటీ
వీధుల్లో లేడీస్ సూట్లు, దుప్పట్లు, బెడ్ షీట్లు అమ్ముతూ దోపిడీలకు పాల్పడే ముఠా హైదరాబాద్‌కు వచ్చిందని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. బీదర్, గుల్బర్గాలోని గ్యాంగ్‌స్టర్లు నగరానికి వచ్చారని పలువురు సోషల్ అకౌంట్లలో ఫొటోలు షేర్ చేస్తున్నారు. అయితే, ఇది పూర్తిగా అవాస్తవమని ఉన్నతాధికారులు క్లారిటీ ఇచ్చారు. పాత ఫొటోలను వైరల్ చేస్తున్నారని స్పష్టం చేశారు.
SHARE IT
News November 28, 2024
నాచారంలో దేశంలోనే అతిపెద్ద హైపర్ మార్ట్ నేడే ప్రారంభం
పటాన్‌చెరులో అద్భుత విజయం సాధించిన హైపర్ మార్ట్-వ్యాల్యుజోన్ ఇప్పుడు నాచారంలో ప్రారంభంకానుంది. ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ నేడు హైపర్ మార్ట్‌ను ప్రారంభించనున్నారు. ఫ్యాషన్, కిరాణా సరుకులు, ఫుట్‌వేర్, లగేజ్, ఫర్నిషింగ్ వంటి బ్రాండ్‌లను ఒకే చోట అందిస్తోంది వాల్యూజోన్. రోజువారీ అవసరాల నుంచి ప్రత్యేక వస్తువుల వరకు వినియోగదారుల కోసం హైపర్ మార్ట్-వ్యాల్యూజోన్ అందుబాటులోకి రానుంది.