News March 18, 2024

హైదరాబాద్‌: కాంగ్రెస్‌లో కన్‌ఫ్యూజన్..!

image

లోక్‌సభ ఎన్నికల ముంగిట HYD, రంగారెడ్డిలోని 3 స్థానాలపై కన్‌ఫ్యూజన్ నెలకొంది. ఇటీవల INC చేవెళ్ల అభ్యర్థిని తానే అంటూ పట్నం సునీత గ్రౌండ్‌ వర్క్ మొదలుపెట్టారు. కానీ, అనూహ్యంగా రంజిత్ రెడ్డి పేరు తెరమీదకొచ్చింది. సికింద్రాబాద్‌‌ టికెట్ బొంతు రామ్మోహన్‌‌దే అంటూ ఆయన అనుచరులు ప్రచారం చేస్తుండగా.. దానం నాగేందర్‌‌‌కు అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఈ స్థానాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మీ కామెంట్..?

Similar News

News September 3, 2025

HYD: ఏఐ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్‌గా తెలంగాణ: మంత్రి

image

తెలంగాణను ఏఐ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్‌గా మార్చడమే తమ ప్రభుత్వ సంకల్పమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈరోజు HYD హైటెక్ సిటీలో అమెరికాకు చెందిన ప్రముఖ ఎంటర్‌ప్రైజ్ ప్రొక్యూర్మెంట్, సప్లయర్ కొలాబరేషన్ సంస్థ జాగర్ (JAGGAER) గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను మంత్రి ప్రారంభించారు. ‘ఒక్క టెక్నాలజీనే కాకుండా అన్ని రంగాలకు చెందిన ప్రపంచ దిగ్గజ సంస్థలకు HYD గమ్యస్థానంగా మారిందని మంత్రి తెలిపారు.

News September 3, 2025

ఖైరతాబాద్: నిమజ్జనానికి రూట్ మ్యాప్ రెడీ: సీపీ ఆనంద్

image

గణేశ్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు ముందుగానే సిద్ధం చేశామని HYD సీపీ సీవీ.ఆనంద్ తెలిపారు. రూట్ మ్యాప్‌లో భాగంగా ఆయన HYD కలెక్టర్ హరిచందన, రాచకొండ సీపీ సుధీర్‌బాబు, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో కలిసి బాలాపూర్ గణేశ్ మండపాన్ని ఈరోజు సందర్శించారు. ప్రత్యేక పూజల అనంతరం నిమజ్జన శోభాయాత్ర సాగే చాంద్రాయణగుట్ట, చార్మినార్, మొజాంజాహీ మార్కెట్, అబిడ్స్, ట్యాంక్ బండ్ రూట్‌లను పరిశీలించి పలు సూచనలు చేశారు.

News September 3, 2025

సికింద్రాబాద్: BIS అధికారుల తనిఖీలు

image

సికింద్రాబాద్ సీటీసీ కాంప్లెక్స్‌లో ఉన్న ఓ గోదాంలో ఈరోజు బీఐఎస్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో దాదాపు రూ.8 లక్షల పైగా విలువైన 225 ఉత్పత్తులకు బీఐఎస్ ధ్రువీకరణ లేదని గుర్తించినట్లు తెలిపారు. ఐఎస్ఐ మార్క్ లేని, నకిలీ ఐఎస్ఐ ముద్ర ఉన్న ఉత్పత్తులు జప్తు చేసినట్లు వెల్లడించారు. వీటిలో మిక్సర్లు, ప్రెజర్ కుక్కర్లు, ఫ్యాన్లు తదితర వస్తువులను గుర్తించారు. కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు.