News June 11, 2024
హైదరాబాద్.. ఎంఎన్సీలకు హాట్స్పాట్!

హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. లీజు ఎన్ని కోట్లు ఉన్నా ఎంఎన్సీలు వెనుకాడటం లేదు. హైటెక్ సిటీలోని ‘ది స్కై వ్యూ బిల్డింగ్’లో 4.14లక్షల SFT ఆఫీస్ స్పేస్ కోసం క్వాల్కామ్ నెలకు రూ.3.15కోట్లు (సెక్యురిటీ డిపాజిట్ రూ.16కోట్లు) చెల్లిస్తోంది. ఇదే తరహాలో అనేక బడా సంస్థలు ఆఫీస్ లీజు కోసం పెద్ద మొత్తంలో చెల్లిస్తుండటం హైదరాబాద్ డిమాండ్కు నిదర్శనం అంటున్నారు విశ్లేషకులు.
Similar News
News November 14, 2025
బిహార్ కౌంటింగ్.. వీడనున్న సస్పెన్స్!

బిహార్లో 243 అసెంబ్లీ స్థానాలతో పలు రాష్ట్రాల్లోని ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. బిహార్లో మొత్తం 2,616 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 38 జిల్లాల్లోని 46 సెంటర్లలో కౌంటింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపునకు ఈసీ 4,372 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేసింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, తర్వాత ఈవీఎం ఓట్లను లెక్కించనున్నారు.
News November 14, 2025
నవంబర్ 14: చరిత్రలో ఈ రోజు

⋆ 1889: భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జననం (ఫొటోలో)
⋆ 1948: రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్ జననం
⋆ 1967: భారత మాజీ క్రికెటర్ సి.కె.నాయుడు మరణం
⋆ జాతీయ బాలల దినోత్సవం
⋆ తెలంగాణ నీటిపారుదల దినోత్సవం
⋆ ప్రపంచ మధుమేహ దినోత్సవం
News November 14, 2025
జక్కన్న.. ఏం ప్లాన్ చేశావయ్యా?

రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా SSMB29 నుంచి ఇవాళ బిగ్ అప్డేట్ రానుంది. దీని కోసం మేకర్స్ రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు. కాగా ఈవెంట్కు వ్యాఖ్యాతలుగా యాంకర్ సుమతో పాటు యూట్యూబర్ ఆశిష్ వ్యవహరిస్తారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో వారితో రాజమౌళి డిస్కషన్స్ చేస్తున్న ఫొటోలు వైరలవ్వగా ‘ఏం ప్లాన్ చేశావయ్యా జక్కన్న’ అంటూ ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.


