News May 3, 2024

హైదరాబాద్‌లోనే ఢిల్లీ పోలీసుల మకాం

image

అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది. నిన్న హైదరాబాద్ వచ్చిన ఢిల్లీ పోలీసులు ఇక్కడే మకాం వేశారు. ఇవాళ మరో IPS అధికారి కూడా రానున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా మార్ఫింగ్ వీడియో కేసు నిందితులను అరెస్ట్ చేయాలని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. అయితే వారి కంటే ముందే హైదరాబాద్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో వారిని తీసుకెళ్లేవరకు ఢిల్లీ పోలీసులు ఇక్కడే ఉంటారని సమాచారం.

Similar News

News January 14, 2025

‘గేమ్ ఛేంజర్’ కలెక్షన్లకు ఏమైంది?

image

‘గేమ్ ఛేంజర్’ రిలీజైన తొలిరోజు రూ.186 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు మూవీ టీమ్ ట్వీట్ చేసింది. ఏమైందో తెలియదు గానీ ఆ తర్వాతి రోజు నుంచి అధికారికంగా వసూళ్లను వెల్లడించట్లేదు. తొలి రోజు తర్వాత కలెక్షన్లు తగ్గినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఈ సినిమాపై కుట్ర జరుగుతోందని, పైరసీ ప్రింట్ లీక్ చేశారని మూవీ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, రూ.400 కోట్లతో దీన్ని తెరకెక్కించారు.

News January 14, 2025

నన్ను ఆ పేరుతో పిలవకండి: తమిళ హీరో

image

తమిళ హీరో జయం రవి అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు. ఇకపై తనను జయం రవి అని కాకుండా రవి లేదా రవి మోహన్ అని పిలవాలని కోరారు. జయం రీమేక్‌లో నటించడంతో ఆయన పేరు జయం రవిగా మారింది. ఈ క్రమంలో తనను పాత పేరుతోనే పిలవాలన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన కాదళిక్క నేరమిళై మూవీ ఇవాళ థియేటర్లలో విడుదల కానుంది.

News January 14, 2025

‘మీ పరిహారం హోటల్ ఖర్చులకూ సరిపోదు’.. బైడెన్‌పై సెటైర్లు

image

కాలిఫోర్నియా వైల్డ్ ఫైర్ బాధితులకు అధ్యక్షుడు జో బైడెన్ పరిహారం ప్రకటించారు. వన్ టైమ్ పేమెంట్ కింద సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలకు 770 డాలర్ల (రూ.66,687) చొప్పున ఇస్తామని తెలిపారు. దీనిపై కొందరు అమెరికా పౌరులు మండిపడుతున్నారు. ఉక్రెయిన్‌కు బిలియన్ల డాలర్లు ఇస్తూ తమకు ఇంత తక్కువ పరిహారం ఇస్తారా అని పోస్టులు చేస్తున్నారు. ఆ 770 డాలర్లు ఒక రోజు నైట్ హోటల్ ఖర్చులకూ చాలవని సెటైర్లు వేస్తున్నారు.