News August 29, 2025
క్రీడా ప్రపంచానికే హైదరాబాద్ వేదిక కావాలి: రేవంత్

తెలంగాణకు ఐటీ సంస్కృతి ఉన్నట్లుగానే క్రీడా సంస్కృతి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. క్రీడా ప్రపంచానికి హైదరాబాద్ వేదిక కావాలని స్పోర్ట్స్ హబ్ బోర్డ్ <<17546114>>సమావేశంలో<<>> అన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే తాము క్రీడా రంగానికి బడ్జెట్ 16 రెట్లు పెంచామని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన ఆటగాళ్లకు ప్రోత్సాహాకాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News August 29, 2025
Duleep Trophy అరంగేట్రంలోనే డబుల్ సెంచరీ

దులీప్ ట్రోఫీ అరంగేట్రంలోనే సెంట్రల్ జోన్ ప్లేయర్ డానిష్ మలేవార్ డబుల్ సెంచరీతో అదరగొట్టారు. నార్త్ జోన్‌తో మ్యాచులో 222 బంతుల్లో 36 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 203 రన్స్ చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగారు. దులీప్ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన తొలి విదర్భ ఆటగాడిగా డానిష్ రికార్డ్ సృష్టించారు. గతేడాది రంజీ ట్రోఫీలో రాణించడంతో ఆయన సెంట్రల్ జోన్‌కి ఎంపికయ్యారు. ప్రస్తుతం సెంట్రల్ జోన్ 488/3 రన్స్ చేసింది.
News August 29, 2025
BSNL: రూ.151తో 25 OTTలు, 450 ఛానళ్లకు యాక్సెస్

BSNL తన మొబైల్ కస్టమర్ల కోసం కొత్త BiTV ప్రీమియం ప్యాక్‌ను లాంచ్ చేసింది. నెలకు రూ.151 చెల్లిస్తే 25కి పైగా OTT ప్లాట్‌ఫామ్స్, 450కి పైగా లైవ్ టీవీ ఛానల్స్ పొందొచ్చు. ఈ ప్యాక్‌లో ZEE5, SonyLIV, Shemaroo, Sun NXT, Chaupal, Lionsgate Play, Discovery+, Epic ON వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. న్యూస్, స్పోర్ట్స్, ప్రాంతీయ ఛానళ్లతో సహా అనేక లైవ్ టీవీ ఛానళ్లూ చూడొచ్చు.
News August 29, 2025
సురక్షిత నగరాల్లో విశాఖకు చోటు

దేశంలో మహిళల జీవనం, భద్రతకు అత్యంత సురక్షిత నగరంగా విశాఖ నిలిచింది. కోహిమా, భువనేశ్వర్, ఐజ్వాల్, గ్యాంగ్‌టక్, ఈటానగర్, ముంబైలతో కలిసి సంయుక్తంగా టాప్ ప్లేస్‌ను కైవసం చేసుకుంది. మహిళల భద్రత, సురక్షిత జీవన పరిస్థితులపై నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ అండ్ ఇండెక్స్ సర్వే చేసింది. మహిళలకై మౌలిక సదుపాయాలు, పోలీసింగ్, పౌరభాగస్వామ్యం ఈ నగరాల్లో ఉన్నట్లు తేలింది. దక్షిణాదిలో కేవలం విశాఖకే చోటు దక్కడం విశేషం.