News April 9, 2024
అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మృతి
మూడు వారాలుగా కనిపించకుండా పోయిన హైదరాబాద్ విద్యార్థి మహ్మద్ అబ్దుల్ అర్ఫాత్ (25) మృతి చెందినట్లు న్యూయార్క్‌లోని భారత రాయబాయ కార్యాలయం ప్రకటించింది. అర్ఫాత్‌ను గుర్తించేందుకు అక్కడి అధికారులతో కలిసి రాయబాయ కార్యాలయం అధికారులు పనిచేశారు. అయినప్పటికీ అతణ్ని రక్షించలేకపోయారు. క్లీవ్‌ల్యాండ్ స్టేట్ యూనివర్సిటీలో మాస్టర్స్ కోసం 2023లో అర్ఫాత్ అమెరికా వెళ్లారు.
Similar News
News January 10, 2025
SHOCKING: ఆన్‌లైన్‌లో ‘గేమ్ ఛేంజర్’ HD ప్రింట్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాను పైరసీ వెంటాడింది. రూ.450+ కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించిన సినిమా ఒక్కరోజు పూర్తికాకుండానే HD ప్రింట్‌లో అందుబాటులోకి రావడంతో అంతా షాక్ అవుతున్నారు. ఇది హార్ట్ బ్రేకింగ్ అంటూ సినీవర్గాలు సైతం పైరసీని ఖండిస్తూ ట్వీట్స్ చేస్తున్నాయి. కాగా, దీనిపై మేకర్స్ ఇంకా స్పందించలేదు. పైరసీని ఎంకరేజ్ చేయకుండా థియేటర్లలో సినిమా చూడండి.
News January 10, 2025
ఢిల్లీ పొలిటికల్ దంగల్‌కి నోటిఫికేషన్ విడుదల
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ శుక్రవారం విడుదలైంది. ఈ రోజు నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభంకానుంది. Jan 17 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ. అధికార ఆప్, విపక్ష బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికను దాదాపుగా ఖరారు చేసి ప్రచారాన్ని ప్రారంభించాయి. ఒకే విడతలో Feb 5న జరగనున్న ఎన్నికల కోసం ఆయా పార్టీలు పోటాపోటీగా ఉచితాలు ప్రకటిస్తున్నాయి. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.
News January 10, 2025
అది నిరూపిస్తే నేను పేరు మార్చుకుంటా: అశ్విన్
రిషభ్ పంత్ దూకుడైన ఆటతో పాటు డిఫెన్స్ బాగుంటుందని రవిచంద్రన్ అశ్విన్ అన్నారు. BGTలో పంత్ పరిస్థితులకు తగ్గట్లు ఆడలేకపోయాడనే విమర్శల నేపథ్యంలో అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో ఈ మేరకు స్పందించారు. అతను డిఫెన్స్ చేస్తూ 10సార్లు ఔట్ అయిన క్లిప్ చూపిస్తే తన పేరు మార్చుకుంటానని సవాల్ విసిరారు. పంత్ డిఫెన్స్ ప్రపంచంలోనే అత్యుత్తమైనదని కొనియాడారు. అతని దగ్గర అన్ని రకాల షాట్లు ఉన్నాయని చెప్పారు.