News February 5, 2025
రొమ్ము క్యాన్సర్ కేసుల్లో హైదరాబాద్ టాప్

దేశంలో అత్యధికంగా హైదరాబాద్‌లో రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదైనట్లు NIMS విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది. జనాభా ఆధారిత క్యాన్సర్ రిజిస్ట్రీ (PBCR) నివేదిక (2014–2016) ప్రకారం HYDలో లక్ష మంది మహిళల్లో 48 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. తర్వాతి స్థానాల్లో చెన్నై(42.2), బెంగళూరు(40.5), ఢిల్లీ(38.6), ముంబై(34.4) ఉన్నాయి. మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో అత్యధికంగా రొమ్ము క్యాన్సరే(35.5%) ఉంది.
Similar News
News March 14, 2025
మార్చి 14: చరిత్రలో ఈ రోజు

* 1879: భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ జననం
* 1883: రాజకీయ-ఆర్థికవేత్త కార్ల్ మార్క్స్ మరణం
* 1890: మలయాళ పత్రిక ‘మలయాళ మనోరమ’ సర్క్యులేషన్ ప్రారంభం
* 1918: సినీ సంగీత దర్శకుడు కేవీ మహదేవన్ జననం
* 1931: తొలి టాకీ చిత్రం ‘ఆలం ఆరా’ ముంబైలో విడుదల
* 1965: బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ జననం
* 2018: భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మరణం
News March 14, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News March 14, 2025
బోరుగడ్డకు 14 రోజుల రిమాండ్

AP: రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్‌కు కోర్టు రిమాండ్ విధించింది. జైలులో లొంగిపోయిన ఆయనను పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకున్న చిలకలపూడి పోలీసులు అదనపు జిల్లా జడ్జి ముందు హాజరుపరిచారు. చిలకలపూడి పీఎస్‌లో నమోదైన కేసుల్లో అనిల్‌కు ఈ నెల 27 వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు.