News August 26, 2024
HYDRA..తగ్గిదిలే..మా దగ్గర కూల్చేయండి..AI ఫోటో వైరల్
HYD మహానగరంలో HYDRA దూకుడు పై సోషల్ మీడియా వేదికగా AI ఉపయోగించి రూపొందించిన పలు చిత్రాలు వైరల్ అవుతున్నాయి. HYDRA అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం మోపుతోందని, మా ప్రాంతంలోనూ అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, వెంటనే చర్యలు చేపట్టాలని జిహెచ్ఎంసి, ఇతర శాఖల అధికారులకు కోకొల్లలుగా నెటిజన్లు ఫిర్యాదులు చేస్తున్నారు. చెరువులోనే భవన నిర్మాణాలు జరిగి ఏళ్లు గడుస్తున్నాయని పలువురు ఆరోపించారు.
Similar News
News September 17, 2024
బాలాపూర్ లడ్డూ.. 30 ఏళ్లలో ఆమె ఒక్కరే..!
HYD బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం ప్రతీ సంవత్సరం ఎంతో ఉత్కంఠ నడుమ కొనసాగుతుంది. అయితే ప్రతిసారి ఇందులో పురుషులే పాల్గొంటూ ఉంటారు. కానీ 2009లో మాత్రం సరిత అనే మహిళ వేలంలో పాల్గొని రూ.5,10,000కు లడ్డూ కైవసం చేసుకుని సత్తా చాటారు. 1994 నుంచి 2024 వరకు 30 ఏళ్లలో బాలాపూర్ లడ్డూ కొన్న ఒకే ఒక్క మహిళగా సరిత నిలిచారు. ఈసారి రూ.30,01,000కు కొలన్ శంకర్ రెడ్డి లడ్డూ దక్కించుకున్న విషయం తెలిసిందే.
News September 17, 2024
బాలాపూర్ లడ్డూ స్పెషల్.. ఒక్కరే ఐదు సార్లు..!
HYD బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. కాగా 1994లో ఈ వేలం ప్రారంభమవగా తొలిసారి కొలన్ మోహన్ రెడ్డి రూ.450కి లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం ఆయనే 1995లో రూ.4,500, 1998లో రూ.51,000, 2004లో రూ.2,01,000, 2008లో రూ.5,07,000 వేలం పాడి ఐదు సార్లు లడ్డూ కైవసం చేసుకున్నారు. గత 30 ఏళ్లలో ఆయన రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేదు. SHARE IT
News September 17, 2024
దద్దరిల్లుతున్న హైదరాబాద్
వినాయక నిమజ్జనాలు, భారీ జులూస్‌లతో హైదరాబాద్ దద్దరిల్లుతోంది. వేలాది విగ్రహాలు ట్యాంక్‌బండ్‌కు క్యూ కట్టాయి. మరికాసేపట్లో ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ గణేశుడి భారీ శోభాయాత్ర ప్రారంభంకానుంది. ఈ దృశ్యాన్ని చూసేందుకు నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. కళాకారుల నృత్యాలు, డప్పు చప్పుళ్లు, LED లైట్ల నడుమ యువత కేరింతలు కొడుతున్నారు. ‘జై బోలో గణేశ్ మహరాజ్‌కి జై’ నినాదంతో HYD హోరెత్తింది.