News August 26, 2024
‘HYDRA తగ్గేదేలే.. మా దగ్గర కూల్చేయండి’

HYD మహానగరంలో HYDRA దూకుడుపై సోషల్ మీడియా వేదికగా AI ఉపయోగించి రూపొందించిన పలు చిత్రాలు వైరల్ అవుతున్నాయి. HYDRA అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం మోపుతోందని, మా ప్రాంతంలోనూ అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, వెంటనే చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ, ఇతర శాఖల అధికారులకు కోకొల్లలుగా నెటిజన్లు ఫిర్యాదులు చేస్తున్నారు. చెరువులోనే భవన నిర్మాణాలు జరిగి ఏళ్లు గడుస్తున్నాయని పలువురు ఆరోపించారు.
Similar News
News January 1, 2026
BREAKING.. RR: గురునానక్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. కాలేజీ హాస్టల్‌లో బీటెక్ విద్యార్థి రాము (20) అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురునానక్ కాలేజీలో రాము బీటెక్ ఫస్టియర్ చదువుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 1, 2026
చందన్వెల్లి చౌరస్తా.. ప్రపంచపు డిజిటల్ గల్లా పెట్టె!

వాట్సాప్ స్టేటస్ పెట్టినా, నెట్‌ఫ్లిక్స్‌లో మూవీ చూసినా ఆ డేటా వచ్చి చేరే ‘ప్రపంచపు డిజిటల్ లాకర్’ మన చేవెళ్లలో ఉంది. చందన్వెల్లి-షాబాద్ బెల్ట్ ఇప్పుడు అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలకు అడ్డా. గ్లోబల్ కంపెనీలు ₹లక్షల కోట్లు కుమ్మరిస్తున్నాయి. RRR కనెక్టివిటీ తోడైతే ఇండియాకే ‘డిజిటల్ పవర్ హౌస్’ కానుంది. పొలాలకు C/O అడ్రసైన ప్రాంతం, ఇప్పుడు ప్రపంచపు డేటాకు సెక్యూరిటీ గార్డ్‌లా మారుతోంది.
News January 1, 2026
ఫ్యూచర్ సిటీ ముందున్న ‘కొత్త’ సవాళ్లు

కొత్తగా ఏర్పడిన ఫ్యూచర్ సిటీ ముందున్న కొత్త సవాళ్లను న్యూ ఇయర్ సందర్భంగా ఓ లుక్కేద్దాం. ఈ ప్రాంతమంతా కొండలతో ఉంటుంది. ఇక్కడ డ్రోన్లూ, GPS పెద్దగా పనిచేయకపోవచ్చనే చర్చ నడుస్తోంది. అకస్మాత్తుగా పరిధి మారడంతో అధికారుల మధ్య సంయవన లోపం ఏర్పడే అవకాశం లేకపోలేదు. అన్నింటికంటే ప్రధాన సమస్య రోడ్లపై ముందుగా దృష్టి సారించాల్సి ఉంటుంది. రూరల్ ఏరియా కావడం ప్రజా రావాణాను ముందు మెరుగుపరచాలి.


