News August 26, 2024

‘HYDRA తగ్గేదేలే.. మా దగ్గర కూల్చేయండి’

image

HYD మహానగరంలో HYDRA దూకుడుపై సోషల్ మీడియా వేదికగా AI ఉపయోగించి రూపొందించిన పలు చిత్రాలు వైరల్ అవుతున్నాయి. HYDRA అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం మోపుతోందని, మా ప్రాంతంలోనూ అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, వెంటనే చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ, ఇతర శాఖల అధికారులకు కోకొల్లలుగా నెటిజన్లు ఫిర్యాదులు చేస్తున్నారు. చెరువులోనే భవన నిర్మాణాలు జరిగి ఏళ్లు గడుస్తున్నాయని పలువురు ఆరోపించారు.

Similar News

News November 2, 2025

HYDలో KCR చేసింది ఏం ఉంది: CM రేవంత్ రెడ్డి

image

HYDలో KCR అభివృద్ధి చేసిందేమీ లేదని CM రేవంత్ రెడ్డి అన్నారు. ఎర్రగడ్డలో నవీన్‌ యాదవ్‌కు మద్దతుగా CM రోడ్‌ షో‌ నిర్వహించారు. ‘సిటీకి YSR మెట్రో తెచ్చారు. ORR, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కాంగ్రెస్ నిర్మించింది. IT, ఫార్మా కంపెనీలు మేమే తీసుకొచ్చాము. చంద్రబాబు నాయుడు, YS రాజశేఖర్ రెడ్డి వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చాయి. మరి HYDలో KCR చేసింది ఏం ఉంది’ అంటూ రేవంత్ నిలదీశారు. దీనిపై మీ కామెంట్?

News November 1, 2025

హుస్సేన్‌సాగర్‌లో యువతి మృతదేహం కలకలం

image

హుస్సేన్‌సాగర్‌లో యువతి మృతదేహం(22) కలకలం రేపింది. లేక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని యువతి మృతదేహం నీటిలో తేలియాడుతుందని ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్‌కు చేరుకున్న లేక్ సిబ్బంది డెడ్‌బాడీని బయటకు తీసి, గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాపు చేపట్టారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 1, 2025

రేవంత్‌‌‌కు KTR “జూబ్లీహిల్స్ ప్రోగ్రెస్ రిపోర్ట్” కౌంటర్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ముమ్మరం కావడంతో BRS పాలనలో జూబ్లీహిల్స్ అభివృద్ధి, కాంగ్రెస్ ప్రభుత్వంలో పథకాల అమలుపై రేవంత్ రెడ్డి, KTR ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చేందుకు KTR త్వరలో కౌంటర్ రిపోర్ట్ ఇవ్వనున్నారు. BRS హయాంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధానంగా చేపట్టిన ఫ్లైఓవర్లు, మెట్రో రైలు, ఫ్రీ వాటర్ ఇతర అభివృద్ధి పనులపై నివేదిక ఇవ్వనున్నారు.