News August 29, 2024
హైడ్రా కూల్చివేతలు.. సీఎస్ కీలక సమావేశం

TG: హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో సీఎస్ శాంతికుమారి కీలక సమావేశం నిర్వహించారు. హైడ్రా, GHMC, HMDA, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో పాటు HYD, RR, మేడ్చల్, సంగారెడ్డి కలెక్టర్లతో భేటీ అయ్యారు. న్యాయపరమైన సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా నిబంధనల ప్రకారమే ముందుకెళ్లాలని హైడ్రాను HC ఆదేశించిన విషయం తెలిసిందే.
Similar News
News November 17, 2025
శాశ్వతంగా నిలిపివేస్తున్నాం.. క్షమించండి: iBOMMA

ఐ-బొమ్మ వెబ్సైట్లో చివరి సందేశం దర్శనమిస్తోంది. ‘ఇటీవల మా గురించి వినే ఉంటారు. మొదటి నుంచి మా విశ్వసనీయ అభిమానిగా ఉన్నారు. ఏదేమైనా, మా సేవలను దేశంలో శాశ్వతంగా నిలిపేస్తున్నాం. అందుకు చింతిస్తూ క్షమాపణలు కోరుతున్నాం’ అని పేర్కొంది. ఇటీవల <<18309765>>పోలీసులు<<>> మూవీ పైరసీ చేస్తున్న iBOMMA గుట్టురట్టు చేశారు. నిర్వాహకుడు ఇమ్మడి రవిని కటకటాల్లోకి నెట్టారు.

ఈ మాస్క్తో అవాంఛిత రోమాలకు చెక్

చాలామంది అమ్మాయిలను వేధించే సమస్య అవాంఛిత రోమాలు. వంశపారంపర్యం, హార్మోన్ల అసమతుల్యత, పలు అనారోగ్యాలు, కొన్ని మందులు వాడటం వల్ల ఇవి వస్తాయి. వీటిని తగ్గించాలంటే స్పూన్ జెలటిన్ పొడి, పాలు, తేనె, పసుపు కలిపి క్లీన్ చేసిన ముఖానికి అప్లై చేసుకోవాలి. కనుబొమ్మలు, కంటికి అంటకుండా మాస్క్ వేయాలి. 20 నిమిషాల తర్వాత మృదువుగా తొలగించాలి. తర్వాత ఐస్ క్యూబ్స్తో ముఖాన్ని రుద్ది మాయిశ్చరైజర్ రాస్తే సరిపోతుంది.