News September 9, 2024

హైడ్రా కూల్చివేతలు.. అధికారులకు రంగనాథ్ దిశానిర్దేశం

image

TG: హైడ్రా కూల్చివేతలపై అధికారులతో కమిషనర్ రంగనాథ్ సమీక్ష చేపట్టారు. కూల్చివేతలపై వస్తున్న ఫిర్యాదులు, వ్యతిరేకతపై చర్చించారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఇళ్ల కూల్చివేతలపై తీసుకున్న నిర్ణయాలను అధికారులకు రంగనాథ్ వివరించారు. రానున్న రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. బాధితులకు ఇవ్వాల్సిన స్పష్టతపై దిశానిర్దేశం చేశారు.

Similar News

News October 18, 2025

పాక్ దాడుల్లో 8 మంది అప్గాన్ క్రికెటర్లు మృతి!

image

పాక్ జరిపిన వైమానిక దాడుల్లో అప్గానిస్థాన్ క్లబ్ లెవల్ క్రికెటర్లు 8మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అప్గాన్ క్రికెట్ బోర్డు వెల్లడించినట్లు ‘TOLO NEWS’ పేర్కొంది. మరో నలుగురికి గాయాలైనట్లు సమాచారం. మ్యాచులు పూర్తయ్యాక క్రికెటర్లు పక్టికాలోని షరానా నుంచి అర్గోన్‌కు వెళ్తుండగా బాంబు దాడులకు ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నారు. ఈ దాడుల్లో పౌరులు, చిన్నారులు మృతి చెందినట్లు తెలుస్తోంది.

News October 18, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 18, 2025

సీజ్‌ఫైర్‌‌కు తూట్లు.. అఫ్గాన్‌పై పాక్ ఎయిర్ స్ట్రైక్స్

image

పాక్-అఫ్గాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని దోహాలో చర్చలు ముగిసే వరకు పొడిగించారు. కానీ, పాక్ మాత్రం పక్టికా ప్రావిన్స్‌లోని అర్గున్, బర్మాల్ జిల్లాల్లో నివాస ప్రాంతాల్లో ఎయిర్ స్ట్రైక్స్ చేసినట్లు ‘TOLO NEWS’ పేర్కొంది. దీనిని తాలిబన్ సీనియర్ లీడర్ ఖండించారు. ‘పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. మేము కచ్చితంగా బుద్ధి చెప్తాం’ అని పేర్కొన్నారు.