News September 21, 2024
మూసీలో రేపటి నుంచి హైడ్రా కూల్చివేతలు షురూ

హైదరాబాద్‌లో మూసీ ప్రక్షాళనలో భాగంగా పరివాహక ప్రాంతాల్లోని ఆక్రమణల కూల్చివేతలకు ప్రభుత్వం సిద్ధమైంది. తొలుత నదీ గర్భంలోని ఆక్రమణలను తొలగించనున్నారు. దాదాపు 55K.Mల పరిధిలో 12వేలకు పైగా ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించారు. ఈ కూల్చివేతల బాధ్యతలను హైడ్రాకు అప్పగించగా, రేపటి నుంచి బుల్డోజర్ రంగంలోకి దిగనుంది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయిస్తామని మంత్రి పొన్నం తెలిపారు.
Similar News
News November 28, 2025
ఖమ్మంకు ఎన్నికల పరిశీలకులు

గ్రామ పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు ఖర్తడే కాళిచరణ్ సుధామరావు (ఐఏఎస్) గురువారం ఖమ్మం జిల్లాకు విచ్చేశారు. ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్‌లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి స్వాగతం పలికారు. అనంతరం పరిశీలకులు, కలెక్టర్‌తో కలిసి సంబంధిత అధికారులతో ఎన్నికల నిర్వహణపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని పరిశీలకులు అధికారులను ఆదేశించారు.
News November 28, 2025
మహమూద్‌పట్నం పంచాయతీ ఎన్నిక నిలిపివేత

TG: మహబూబాబాద్(D) మహమూద్‌పట్నం పంచాయతీ ఎన్నికను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. 2025 ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకోకుండా 2011 లెక్కల ప్రకారం రిజర్వేషన్లు సరికాదంది. అక్కడ ఉన్న ఆరుగురు STలకు సర్పంచి, 3 వార్డులను కేటాయించడాన్ని తప్పుపట్టింది. తదుపరి విచారణను డిసెంబరు 29కి వాయిదా వేసింది. ఈ ఎన్నికలో రిజర్వేషన్‌ను సవాల్ చేస్తూ యాకూబ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.
News November 28, 2025
వైకుంఠ ద్వార దర్శనం.. ఎంత పుణ్యమో తెలుసా?

వైష్ణవాలయాల్లో ఏడాదంతా మూసి ఉండే ఉత్తర ద్వారాలు వైకుంఠ ఏకాదశి నాడు తెరుచుకుంటాయి. శ్రీవారి దర్శనార్థం 3 కోట్ల దేవతల రాకను సూచిస్తూ వీటిని తెరుస్తారు. ఇందులో నుంచి వెళ్లి స్వామిని దర్శించుకుంటే స్వర్గంలోకి ప్రవేశించినంత పవిత్రంగా భావిస్తారు. అలాగే పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఇందుకు సంబంధించి టికెట్లను TTD నిన్న విడుదల చేసింది. ☞ వాటిని ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.


