News September 30, 2024
మూసీ ప్రాజెక్టుతో హైడ్రాకు సంబంధం లేదు: రంగనాథ్

TG: మూసీ నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదని కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. ‘అక్కడి నివాసితులను హైడ్రా తరలించట్లేదు. కూల్చివేతలు చేపట్టడం లేదు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టును మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపడుతోంది. హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకే. TGలో ఇతర ప్రాంతాల్లో కూల్చివేతలను హైడ్రాకు ఆపాదించి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు’ అని రంగనాథ్ ఆక్షేపించారు.
Similar News
News November 4, 2025
జబ్బార్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఒకరి మృతి

AP: సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం దామాజిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ఉదయం జబ్బార్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో సురక్ష (30) అనే మహిళ మృతి చెందింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సుకు ఐషర్ వాహనం అడ్డురావడంతో అదుపు తప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మరో 8 మంది గాయపడ్డారు. వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ఉన్నారు.
News November 4, 2025
చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే..

చలికాలంలో చర్మం నిస్తేజంగా, పొడిగా మారుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. రోజుకు రెండుసార్లు మాయిశ్చరైజర్ రాయడంతో పాటు స్నానానికి గోరువెచ్చని నీరే వాడాలని చెబుతున్నారు. నిద్రపోయే ముందు నూనె, లోతైన మాయిశ్చరైజర్లతో స్కిన్ కేర్ చేసుకోవాలి. దీనివల్ల మృదువైన చర్మాన్ని పొందొచ్చు. తగినంత నీరు తాగాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
News November 4, 2025
DRDOలో 105 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

బెంగళూరులోని DRDO ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (LRDE)లో 105 అప్రెంటీస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగాల్లో ITI, డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ పాసైనవారు అప్లై చేసుకోవచ్చు. ముందుగా apprenticeshipindia.gov.in పోర్టల్లో ఎన్రోల్ చేసుకోవాలి. గేట్ స్కోరు, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.drdo.gov.in/


