News December 4, 2024

హైడ్రా కీలక నిర్ణయం

image

TG: ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్రమణలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని డిసైడ్ అయ్యింది. కొత్త ఏడాదిలో ప్రతి సోమవారం HYD బుద్ధభవన్‌లో ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించనుంది. చెరువులు, నాలాలు, పార్క్‌ల ఆక్రమణలపై ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని సూచించింది.

Similar News

News November 28, 2025

సర్పంచ్ పోస్టు@రూ.కోటి

image

TG: సర్పంచ్ పదవులను <<18400001>>ఏకగ్రీవంగా<<>> సొంతం చేసుకునేందుకు వేలంపాటలు జోరుగా సాగుతున్నాయి. మహబూబ్‌నగర్(D) టంకర్ గ్రామ పంచాయతీని ఓ వ్యాపారి ₹కోటికి దక్కించుకున్నారు. ఆంజనేయస్వామి ఆలయానికి నిధులు ఖర్చు చేసేలా ఒప్పందం చేసుకున్నారు. గద్వాల(D) కొండపల్లిలో ₹60L, గొర్లఖాన్‌దొడ్డిలో ₹57L, చింతలకుంటలో ₹38L, ముచ్చోనిపల్లిలో రూ.14.90L, ఉమిత్యాల తండాలో ₹12L చొప్పున సర్పంచ్ సీటుకు వేలంపాట పాడారు.

News November 28, 2025

4 వారాలుగా అనుమతించట్లేదు: ఇమ్రాన్ ఖాన్ సోదరి

image

జైలులో ఉన్న తన సోదరుడు ఇమ్రాన్ ఖాన్‌ను 4 వారాలుగా కలవనివ్వట్లేదని సోదరి నొరీన్ నియాజీ తెలిపారు. ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన నెలకొందన్నారు. ‘ఇమ్రాన్ ఖాన్ విషయంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు. జైలు అధికారులు ఏం చెప్పట్లేదు. మా సోదరుడిని చంపేసినట్లు వార్తలొస్తున్నాయి’ అని వాపోయారు. అంతకుముందు ఖైబర్‌ పఖ్తుంఖ్వా CM సోహైల్ రావల్పిండిలోని జైలు ముందు బైఠాయించి ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతుగా నిరసన తెలిపారు.

News November 28, 2025

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసా?

image

అండాశయం (ఓవరీస్‌) నుంచి అండం గర్భసంచిలోకి వచ్చేలా తోడ్పడే ట్యూబ్స్‌ను ‘ఫెలోపియన్‌ ట్యూబ్స్‌’ అంటారు. కొన్ని సందర్భాల్లో పిండం గర్భసంచిలో బదులు ఈ ఫెలోపియన్‌ ట్యూబుల్లో పెరగడంతోపాటు ఒక్కోసారి అండాశయాల్లో (ఓవరీస్‌), కాస్తంత కిందికి వస్తే గర్భాశయ ముఖద్వారంలో, ఒక్కోసారి కడుపులో కూడా పెరగవచ్చు. ఈ సమస్యనే ‘ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ’గా వ్యవహరిస్తారు. దీనివల్ల కొన్నిసార్లు తల్లికి ప్రాణాపాయం సంభవిస్తుంది.