News September 14, 2024
హైడ్రాకు విశేష అధికారాలు రాబోతున్నాయి: రంగనాథ్

TG: హైడ్రా వ్యవస్థ చట్టబద్ధమైనదేనని కమిషనర్ రంగనాథ్ పునరుద్ఘాటించారు. ‘కార్యనిర్వాహక తీర్మానం ద్వారానే దీనిని ఏర్పాటు చేశారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ OCT నెల లోపు ఆర్డినెన్స్ రానుంది. విశేష అధికారాలు రాబోతున్నాయి. 6 వారాల తర్వాత అసెంబ్లీలో హైడ్రా బిల్లు వస్తుంది. గ్రే హౌండ్స్, టాస్క్ఫోర్స్ తరహాలో ఇది పని చేస్తుంది. మున్సిపాలిటీలు, నీటిపారుదల, రెవెన్యూ శాఖలకు సహకారం అందిస్తాం’ అని తెలిపారు.
Similar News
News September 18, 2025
జనరేషన్-Zపై రాహుల్ ట్వీట్.. అర్థమదేనా?

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ‘ఈ దేశంలోని యువత, విద్యార్థులు, జనరేషన్-Z రాజ్యాంగాన్ని కాపాడతారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారు. ఓట్ల చోరీని ఆపుతారు. నేను వారి వెంటే నిలబడతాను. జైహింద్’ అని రాసుకొచ్చారు. అయితే నేపాల్ తరహాలో భారత్లోనూ జనరేషన్-Z ఉద్యమం వస్తుందన్న కోణంలో రాహుల్ ట్వీట్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనిపై మీరేమంటారు?
News September 18, 2025
ఇకపై మరింత సులభంగా EPFO సేవలు

EPFO <
News September 18, 2025
నాడు మండలి రద్దుకు తీర్మానం.. నేడు అదే కీలకమని వ్యాఖ్యలు!

AP: బిల్లులను అడ్డుకుంటోందంటూ శాసనమండలి రద్దుకు నాటి జగన్ ప్రభుత్వం తీర్మానించి తర్వాత వెనక్కి తీసుకుంది. నేడు అదే మండలిపై జగన్ చేసిన <<17752308>>వ్యాఖ్యలు<<>> వైరలవుతున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్షహోదా ఇవ్వట్లేదని, మండలి సభ్యులే బలంగా పోరాడాలని అన్నారు. మండలి చాలా కీలకమని వ్యాఖ్యానించారు. అయితే అధికారంలో ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడటం చర్చనీయాంశమవుతోంది.