News September 24, 2024
అనుమతులు రద్దు చేయాలంటూ HMDAకు హైడ్రా లేఖ

TG: చెరువుల్లో నిర్మాణాలపై HMDAకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ లేఖ రాశారు. FTL లేదా బఫర్ జోన్లో నిర్మాణాలకు పర్మిషన్ రద్దు చేయాలన్నారు. కోమటికుంటతో పాటు 5 చెరువుల్లో అక్రమ నిర్మాణాలకు ఇచ్చిన అనుమతులను రీ వెరిఫై చేయాలని సూచించారు.
Similar News
News October 22, 2025
కార్తీక మాసం.. భారీగా తగ్గనున్న చికెన్ ధరలు

నేటి నుంచి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమైంది. చాలామంది మాంసాహారం ముట్టకుండా శివుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. దీంతో చికెన్ రేట్లు భారీగా తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రాంతాన్ని బట్టి కేజీ కోడి మాంసం ధర రూ.210 నుంచి రూ.250 వరకు పలుకుతోంది. 2,3 రోజుల్లో రేట్లు తగ్గడం ప్రారంభం అవుతుందని చెబుతున్నారు. కేజీ చికెన్ ధర రూ.170-180కి రావొచ్చని అంటున్నారు.
News October 22, 2025
సత్య నాదెళ్లకు రూ.846 కోట్ల జీతం

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల జీతం భారీగా పెరిగింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గాను ఆయన ప్యాకేజీ అంతకుమందు ఏడాదితో పోలిస్తే 22% అధికమైంది. ప్రస్తుతం ఆయన ఏడాదికి 96.5 మి.డాలర్ల (రూ.846 కోట్లు) జీతం అందుకుంటున్నారు. సత్య నాదెళ్ల, ఆయన లీడర్షిప్ టీమ్ వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మైక్రోసాఫ్ట్ పురోగతి సాధించిందని కంపెనీ బోర్డు తెలిపింది. అలాగే షేర్ల ధరలు పెరిగాయని పేర్కొంది.
News October 22, 2025
RARE PHOTO: ఆకాశంలో అద్భుతం

అత్యంత అరుదుగా కనిపించే రెడ్ స్ప్రైట్స్(ఎర్రటి మెరుపులు) న్యూజిలాండ్లో ఆవిష్కృతమయ్యాయి. NZ ఫొటోగ్రాఫర్ టామ్ రే, స్పానిష్ ఫొటోగ్రాఫర్స్ జఫ్రా, జోస్ సౌత్ ఐలాండ్లో మిల్కీ వే చిత్రాలు తీసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఊహించని దృశ్యాన్ని కెమెరాలో బంధించారు. తుఫానుల సమయంలో ఆకాశంలో ఏర్పడే ఈ రెడ్ స్ప్రైట్స్ 90KM ఎత్తు వరకు వెళ్తాయి. రెప్పపాటులో కనుమరుగయ్యే ఈ మెరుపులను చిత్రీకరించడం ఎంతో కష్టం.