News September 9, 2024

కూల్చివేతల్లో ‘హైడ్రా’ మాస్టర్ ప్లాన్

image

TG: అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో హైడ్రా మాస్టర్ ప్లాన్ అమలు చేస్తోంది. వారాంతాల్లో మాత్రమే కూల్చివేతలు చేపడుతోంది. ఆ రోజుల్లో న్యాయస్థానాలకు సెలవులు కావడంతో బాధితులు కోర్టుకు కూడా వెళ్లే అవకాశం లేకుండా పోతోంది. దీంతో కూల్చివేతలకు ఎలాంటి ఆటంకం కలగటం లేదు. కాగా చెరువులు, నాలాలు, కాలువల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా పంజా విసురుతున్న సంగతి తెలిసిందే.

Similar News

News November 26, 2025

IPL ఆధారంగా టెస్టులకు సెలక్ట్ చేస్తే..

image

టీమ్ ఇండియా బ్యాటర్లు టెస్టుల్లో విఫలం అవడానికి ప్రధాన కారణం IPL ఆధారంగా సెలక్ట్ చేయడమేనని క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. దూకుడుగా ఆడే బ్యాటర్లను వన్డేలు, టీ20లకు ఎంపిక చేయాలి కానీ టెస్టులకు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. సర్ఫరాజ్ ఖాన్, ఇంద్రజిత్, యశ్ రాథోడ్, పృథ్వీ షా, జగదీశన్, రుతురాజ్ గైక్వాడ్ లాంటి డొమెస్టిక్ ప్లేయర్లను తీసుకుంటే బాగుంటుందని సూచిస్తున్నారు.

News November 26, 2025

మహదేవపూర్: SI అత్యుత్సాహం.. మహిళ ఆత్మహత్యాయత్నం?

image

SI ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మహదేవ్‌పూర్‌(M)లో జరిగింది. బాధితురాలి భర్త తెలిపిన వివరాల ప్రకారం.. సూరారానికి చెందిన మహేశ్ రెడ్డి, శైలజ భార్యాభర్తలు. లక్ష్మారెడ్డి అనే ఓ వ్యక్తికి వీరు అప్పు ఇవ్వగా, తిరిగి డబ్బు తీసుకునే విషయంలో SI ఇన్వాల్వ్ అయ్యి వారిని ఇబ్బంది పెట్టాడు. ఈ క్రమంలో ఇంట్లోకి SI చొరబడి తన భార్యను బెదిరింపులకు గురిచేయడంతో పురుగు మందు తాగింది.