News November 5, 2024
రియల్ ఎస్టేట్ రంగంపై హైడ్రా వేటు.. రాష్ట్ర ఆదాయానికి పోటు: KTR
TG: రాష్ట్ర ఆదాయానికి జీవధార అయిన రియల్ ఎస్టేట్ రంగంపై హైడ్రా వేటు వేసిందని KTR అన్నారు. ముందుచూపు లేని ప్రభుత్వ నిర్ణయాలతో ఆదాయానికి పోటు పడిందని ట్వీట్ చేశారు. ‘కేవలం పరిపాలన దక్షత లోపం. విజన్ లేని పాలనా విధానమే దీనికి కారణం. KCR పాలనలో రియల్ ఎస్టేట్ రంగం రయ్ మంటూ ఉరికింది. కాంగ్రెస్ పాలనలో నై నై అంటోంది’ అని విమర్శించారు. HMDA ఆదాయం, రిజిస్ట్రేషన్లు, రాబడులు తగ్గాయన్న వార్తలను షేర్ చేశారు.
Similar News
News November 5, 2024
2025 సమ్మర్ బరిలో రజినీకాంత్ ‘కూలీ’
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న ‘కూలీ’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. 2025 సమ్మర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని డైరెక్టర్ ఓ ఈవెంట్‌లో వెల్లడించారు. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, శివ కార్తికేయన్, శ్రుతి హాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆమిర్ ఖాన్ సైతం కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.
News November 5, 2024
మదర్సాలపై HC తీర్పును తప్పుబట్టిన సుప్రీం
UP మదర్సా చట్టం రాజ్యాంగ విరుద్ధమన్న అలహాబాద్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. విద్యాసంస్థలు స్థాపించి, నిర్వహించే మైనార్టీల హక్కులను అడ్డుకోవద్దని UP ప్రభుత్వానికి CJI చంద్రచూడ్ సూచించారు. UP మదర్సా బోర్డ్ ఎడ్యుకేషన్ యాక్ట్- 2004కు రాజ్యాంగబద్ధత ఉందన్నారు. మదర్సాల్లో మత బోధనలు చేస్తుండటంతో సెక్యులరిజ సూత్రాలకు విరుద్ధమని AHC ఈ APRలో ఈ యాక్టును కొట్టేయగా బోర్డు SCని ఆశ్రయించింది.
News November 5, 2024
సీనియర్ల భవిష్యత్ ఆస్ట్రేలియాలో తేలిపోతుంది: గవాస్కర్
ఆస్ట్రేలియా పర్యటనలో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవితవ్యం తేలిపోతుందని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నారు. వారికి ఆ టూర్ అగ్ని పరీక్ష లాంటిదేనని అభిప్రాయపడ్డారు. ‘సీనియర్ల బ్యాటింగ్ టెక్నిక్‌లో ఎలాంటి తప్పులు లేవు. కానీ 10, 12 ఓవర్లకు మించి ఆడలేకపోతున్నారు. బ్యాటింగ్ చేసేటప్పుడు కొంచెం సహనంతో ఉండాలి. మళ్లీ వారి బ్యాట్ నుంచి పరుగులు రాలడం చూడాలనుకుంటున్నా’ అని ఆయన పేర్కొన్నారు.