News August 24, 2024

‘హైడ్రా’ రంగనాథ్.. సంచలన కేసులకు కేరాఫ్

image

2007లో ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా(ఇబ్రహీంపట్నం) హత్య కేసు ప్రత్యేక దర్యాప్తు అధికారిగా రంగనాథ్ కీలకంగా వ్యవహరించారు. అలాగే తెలంగాణలోని నల్గొండలో అమృత-ప్రణయ్ కేసులో నిందితుడు మారుతిరావు అరెస్టు, విచారణను సమర్థంగా నిర్వహించారు. వరంగల్ మెడికల్ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసును ఆయనే డీల్ చేసి నిందితుడు సైఫ్‌ను త్వరగా అరెస్టు చేశారు. ఇప్పుడు హైడ్రా కమిషనర్‌గా తన మార్క్ చూపుతున్నారు.

Similar News

News November 16, 2025

ఎర్రకోట ఆత్మాహుతి దాడి.. కీలక నిందితుడు అరెస్ట్

image

ఢిల్లీ ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడి కేసులో కీలక పురోగతి సాధించినట్లు NIA ప్రకటించింది. ఈ దాడికి సూసైడ్ బాంబర్ ఉమర్ నబీతో కలిసి కుట్ర చేసిన కశ్మీర్ వాసి అమీర్ రషీద్ అలీని అరెస్టు చేసినట్లు తెలిపింది. కారును కొనుగోలు చేసి, అందులో IED అమర్చేందుకే ఇతను ఢిల్లీకి వచ్చినట్లు పేర్కొంది. ఈనెల 10న జరిగిన ఆత్మాహుతి దాడిలో 10 మంది మరణించగా, 32 మంది గాయపడిన విషయం తెలిసిందే.

News November 16, 2025

రేపు కార్తీక మాసం చివరి సోమవారం.. ఏం చేయాలంటే?

image

కార్తీక మాసం చివరి సోమవారం శివుడిని పూజిస్తే ఆయన అనుగ్రహం పొందవచ్చని పండితులు చెబుతున్నారు. ‘ఉదయాన్నే స్నానం చేయాలి. శివాలయానికి వెళ్లి బిల్వ పత్రాలు సమర్పించాలి. నీళ్లు/పాలు, పెరుగు, తేనె, గంగాజలంతో అభిషేకం చేయించాలి. 365 వత్తులతో దీపాలు వెలిగించాలి. ఉపవాసం ఉండి అన్నదానం, వస్త్రదానం చేయాలి. ఆవుకు ఆహారం పెట్టాలి. దీనివల్ల ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుంది’ అని పేర్కొంటున్నారు.

News November 16, 2025

ముందే పంచాయతీ.. ఆ తర్వాతే పరిషత్ ఎన్నికలు?

image

TG: పరిషత్ ఎన్నికల కంటే ముందుగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల 2 విడతలుగా ముందు MPTC, ZPTC ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కోర్టులో కేసు విచారణ ఉండటం, అటు 15 ఫైనాన్స్ నిధులు ఆగిపోవడంతో ముందు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై రేపు క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే ఛాన్సుంది.