News August 21, 2025
రూ.400 కోట్ల ఆస్తిని కాపాడిన హైడ్రా!

TG: ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. HYD మాదాపూర్ జూబ్లీ ఎన్‌క్లేవ్‌లో పార్కులతో పాటు రహదారుల ఆక్రమణలను తొలగించింది. GHMCకి గిఫ్ట్ డీడ్ చేసిన పార్కులను జైహింద్ రెడ్డి అనే వ్యక్తి కబ్జా చేశారన్న ఎన్‌క్లేవ్ ప్రతినిధుల ఫిర్యాదుతో క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేపట్టింది. కబ్జాకు గురైన 16వేల గజాల స్థలాన్ని పరిరక్షించింది. వీటి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. వీటి విలువ రూ.400 కోట్లని సమాచారం.
Similar News
News April 3, 2026
1,89,819 అక్షరాలతో పదం ఉందని తెలుసా?

Pneumonoultramicroscopicsilicovolcanoconiosis (45 అక్షరాలు) అనేది ఇంగ్లిష్‌లో అత్యంత పొడవైన పదం. అగ్నిపర్వత ధూళి వల్ల వచ్చే వ్యాధి ఇది. అయితే టిన్‌టిన్ అనే ప్రొటీన్ కెమికల్ నేమ్ ఏకంగా 1,89,819 అక్షరాలు ఉంది. Methionylthreonyl.. అంటూ సాగే దీనిని పలకడానికే 2-3hrs పడుతుంది. ఇది 34,350 రకాల ఆమ్లాల గురించి వివరిస్తుంది. దీనిని పదంగా పరిగణించడంపై భిన్నాభిప్రాయాలు ఉండటంతో డిక్షనరీల్లో చోటు దక్కలేదు.
News April 3, 2026
₹167కోట్లు!.. ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన పెయింటింగ్

రాజా రవివర్మ పెయింటింగ్స్‌లో ఒకటైన ‘యశోద-కృష్ణ’ వేలంలో ఏకంగా ₹167.20కోట్లు పలికింది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎండీ సైరస్ పూనావాలా దీనిని దక్కించుకున్నారు. ఎంఎఫ్ హుసేన్ ‘గ్రామ్ యాత్ర’ పెయింటింగ్ రికార్డ్‌ను (₹118Cr) బ్రేక్ చేసి దేశంలోనే ఖరీదైన చిత్రంగా నిలిచింది. ఈ ఆయిల్ పెయింటింగ్‌ను రవివర్మ 1890ల్లో గీశారు. యశోద ఆవు పాలు పితుకుతుంటే బాలకృష్ణుడు పాత్రతో చేయిచాస్తున్నట్టుగా ఈ చిత్రం ఉంది.
News April 3, 2026
ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్య పెంచడం కష్టమే: అరుణ్ ధుమాల్

ఐపీఎల్ మ్యాచ్‌లను పెంచాలన్న డిమాండ్లపై ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మ్యాచ్‌ల సంఖ్యను 84 లేదా 94కు పెంచడం అనేది అంతర్జాతీయ షెడ్యూల్‌పై ఆధారపడి ఉంటుందన్నారు. ప్రస్తుత విండోలోనే (MAR-MAY) మ్యాచ్‌లు పెంచాలంటే డబుల్ హెడర్స్ ఎక్కువవుతాయని.. ఇది బ్రాడ్‌కాస్టర్లకు అంతగా నచ్చదన్నారు. ద్వైపాక్షిక సిరీస్‌లకు డిమాండ్ తగ్గుతున్న నేపథ్యంలో వాటి సంఖ్య తగ్గిస్తే ఐపీఎల్ మ్యాచ్‌లు పెంచుకోవచన్నారు.


