News November 7, 2024
బెంగళూరు పర్యటనకు హైడ్రా బృందం

TG: హైడ్రా బృందం రెండు రోజుల పర్యటనకు గాను బెంగళూరు వెళ్లింది. అక్కడ చెరువుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలో బృందం అధ్యయనం చేయనుంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో ఆక్రమణల తొలగింపుపై హైడ్రా కాస్త నెమ్మదించింది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీతో నిఘా, రియల్ టైమ్‌లో కబ్జాలను కనిపెట్టేలా టెక్నాలజీని హైడ్రా పటిష్ఠపర్చుకుంటోంది.
Similar News
News December 1, 2025
నుదురు వెనక్కి వెళ్లిపోతోందా?

ప్రస్తుతం చాలామంది ఎదుర్కొనే సమస్య హెయిర్ లైన్ రిసీడింగ్. అంటే నుదుటిపై జుట్టు వెనక్కి వెళ్లిపోవడం. దీనివల్ల లుక్ మొత్తం మారిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొప్పు గట్టిగా వేయడం, పాపిడి ఎప్పుడూ ఒకవైపే తీయడం వంటివి చేయకూడదు. అప్పుడు వెంట్రుకలపై ఒత్తిడి పడకుండా ఉంటుంది. ఇలా జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. అలానే మీరు జుట్టు వేసుకొనేటప్పుడు లూజ్‌గా వెయ్యడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
News December 1, 2025
హసీనాపై మరో కేసు! భారత్‌పైనా ఆరోపణలు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని <<18408910>>షేక్ హసీనా<<>>పై మరో కేసు పెట్టేందుకు ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం సిద్ధమైంది. 2009 బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటుకు షేక్ హసీనా కారణమని చెబుతోంది. ఆ హింసాకాండలో భారత్ ప్రమేయం కూడా ఉందని అక్కడి సర్కారు ఏర్పాటు చేసిన కమిటీ నివేదికలో పేర్కొంది. బంగ్లా ఆర్మీని బలహీనపరిచేందుకు ఆ హింసకు భారత్ మద్దతు ఇచ్చిందని ఆరోపిస్తోంది. 2009 హింసాకాండలో సీనియర్ ఆర్మీ అధికారులు సహా 74 మంది మరణించారు.
News December 1, 2025
POK భారత్‌లో అంతర్భాగమే: JK హైకోర్టు

పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) భారత్‌లో అంతర్భాగమేనని, అక్కడ జరిగే వ్యాపారాన్ని ఇన్ట్రా స్టేట్ ట్రేడింగ్‌గా పరిగణించాలని జమ్మూ కశ్మీర్ హైకోర్టు చెప్పింది. GST అమలులోకి వచ్చినప్పటి నుంచి 2019లో POKలో వ్యాపారాన్ని నిలిపేసే వరకు జరిగిన ఎగుమతులు, దిగుమతులకు ట్యాక్స్ కట్టాలని అధికారులిచ్చిన నోటీసులపై వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. దీని విచారణలో భాగంగా హైకోర్టు ఈ కామెంట్లు చేసింది.


