News August 25, 2024
రుణమాఫీని పక్కదారి పట్టించేందుకే హైడ్రా: మహేశ్వర్ రెడ్డి

TG: సీఎం రేవంత్ రెడ్డి హామీలు నెరవేర్చకుండా హైడ్రా పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ‘నిత్యం ఏదో ఒక సంచలనం చేయడమే రేవంత్ పని. సీఎం సోదరుడు, పొంగులేటిపై అక్రమ నిర్మాణాల ఆరోపణలున్నాయి. వాటిని కూల్చగలరా? సెలబ్రిటీల నిర్మాణాలు కూల్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రుణమాఫీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే హైడ్రా హైప్’ అని ధ్వజమెత్తారు.
Similar News
News October 24, 2025
సీటింగ్ పర్మిషన్ తీసుకొని!

కర్నూలులో ప్రమాదానికి గురైన బస్సు యజమానులు ప్రయాణికుల ప్రాణాల కంటే డబ్బుకే ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టం అవుతోంది. 43 సీట్ల సీటింగ్‌కు పర్మిషన్ తీసుకొని దాన్ని స్లీపర్‌గా మార్చడమే దీనికి నిదర్శనం. ఈ బస్సుకు డయ్యూడామన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆల్ ఇండియా పర్మిట్ తీసుకున్నారు. ఒడిశాలో ఆల్ట్రేషన్, ఫిట్నెస్ చేయించారు. 2018లో TGలో, 2023లో NOCతో డయ్యూ డామన్‌లో మరోసారి రిజిస్ట్రేషన్ జరిగింది.
News October 24, 2025
లో దుస్తుల్ని ఎలా ఎంచుకోవాలంటే?

మనం నిత్యం ధరించే లోదుస్తుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. మరీ బిగుతుగా కాకుండా సరైన సైజ్ లోదుస్తులే వాడాలి. సింథటిక్, నాన్ బ్రీతబుల్ మెటీరియల్ వాడకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. ఇవి చెమటలను పీల్చుకోకపోగా బ్యాక్టీరియా వృద్ధికి కారణమవుతాయంటున్నారు. అలాగే మరీ లూజ్‌గా ఉన్నవి వేసుకున్నా అసౌకర్యంగా ఉండటంతో పాటు మెడ, భుజాల నొప్పికి కూడా దారితీస్తాయంటున్నారు.
News October 24, 2025
APEDAలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

APEDA 11 బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్, అసోసియేట్ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసింది. పోస్టును బట్టి బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ (అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్, ప్లాంటేషన్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫారెన్ ట్రేడ్, పబ్లిక్ పాలసీ, కెమిస్ట్రీ లేదా బయోకెమిస్ట్రీ, మైక్రో బయాలజీ), PGDM, MBAతో పాటు పని అనుభవం కలిగిన అభ్యర్థులు NOV 6 వరకు అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్: https://apeda.gov.in/


