News September 3, 2024

జిల్లాల్లోనూ ‘హైడ్రా’ తరహా చర్యలు: సీఎం రేవంత్

image

TG: HYDలోని ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న ‘హైడ్రా’ విస్తరణపై CM రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘చెరువులను ఆక్రమించుకోవడం క్షమించరాని నేరం. దీనివల్ల తీరని నష్టం జరుగుతోంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టడానికి హైడ్రాను తీసుకొచ్చాం. దీన్ని జిల్లాలకూ విస్తరించాలని డిమాండ్ వస్తోంది. అక్కడి అధికార యంత్రాంగమే సిస్టమ్‌ను ఏర్పాటుచేసుకుని ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.

Similar News

News August 5, 2025

‘కాళేశ్వరం’పై చర్చ.. ఈ నెలలోనే అసెంబ్లీ సెషన్!

image

TG: కాళేశ్వరంపై ఘోష్ కమిషన్​ ఇచ్చిన నివేదికపై పూర్తిస్థాయిలో చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముందుగా MLAలు, MLCలకు రిపోర్టును వివరించి అసెంబ్లీలో చర్చ పెట్టనున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఈనెల మూడో వారంలో ప్రత్యేక సెషన్ నిర్వహించేందుకు క్యాబినెట్​లో చర్చించినట్లు సమాచారం. అసెంబ్లీలో చర్చించాక మండలాల వారీగా MLAలు మీటింగ్స్ పెట్టి ‘కాళేశ్వరం’ నివేదికపై వివరించనున్నట్లు తెలుస్తోంది.

News August 5, 2025

కాసేపట్లో అతి భారీ వర్షాలు

image

TG: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కాసేపట్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే సిద్దిపేట, మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాల్లోనూ భారీ వర్షాలకు ఆస్కారం ఉందని చెప్పింది. ఇప్పటికే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. మీ ఏరియాలో వాన కురుస్తోందా?

News August 5, 2025

మెగాస్టార్ వద్దకు వేతనాల పంచాయితీ

image

టాలీవుడ్‌లో ఎంప్లాయిస్ యూనియన్ వేతనాల పంచాయితీ మెగాస్టార్ చిరంజీవి వద్దకు చేరింది. 30శాతం వేతనాలు పెంచాలని ఫిల్మ్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది. అటు వీరితో సంబంధం లేకుండా సొంతంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకుంటామని నిర్మాతలు ప్రకటించారు. ఫెడరేషన్ కోరినట్లుగా వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు ఇవాళ సాయంత్రం ఈ విషయంపై మరోసారి చర్చించేందుకు మెగాస్టార్ చిరంజీవితో సమావేశం కానున్నారు.