News September 30, 2024
హైడ్రా ఇదే విధంగా ముందుకు వెళ్తే స్టే ఇవ్వాల్సి వస్తుంది: హైకోర్టు

TG: ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో అమాయకులను ఇబ్బందులకు గురిచేస్తారా? అని హైకోర్టు ‘హైడ్రా’పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అమీన్పూర్ తహశీల్దార్ కోరడంతో యంత్రాలు, సిబ్బంది సమకూర్చామని రంగనాథ్ కోర్టుకు తెలిపారు. చార్మినార్ కూల్చివేతకు తహశీల్దార్ యంత్రాలు, సిబ్బంది అడిగితే ఇస్తారా? అని ప్రశ్నించింది. హైడ్రా ఇదే విధంగా ముందుకు వెళ్తే స్టే ఇవ్వాల్సి వస్తుందని కోర్టు హెచ్చరించింది.
Similar News
News October 18, 2025
ఆభరణాలు పెట్టుకుంటే అలర్జీ వస్తోందా?

నగలు పెట్టుకున్నపుడు కొందరికి అలర్జీ వస్తుంటుంది. దీన్ని కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటారు. ఆర్టిఫిషియల్ ఆభరణాల్లో ఎక్కువగా వాడే నికెల్ అనే లోహం వల్ల చర్మంపై ఎర్రటి దద్దుర్లు, దురద, మంట, పొక్కులు వస్తుంటాయి. వీటిని వేసుకొనేముందు పౌడర్/ మాయిశ్చరైజర్/ క్యాలమైన్ లోషన్స్ రాసుకుంటే మంచిది. లేదంటే స్టెయిన్లెస్ స్టీల్, టైటానియం, 18 క్యారెట్ ఎల్లో గోల్డ్, స్టెర్లిన్ సిల్వర్లను ఎంచుకోవచ్చు.
News October 18, 2025
DRDO PXEలో 50 అప్రెంటిస్లు

DRDOకు చెందిన ప్రూఫ్ అండ్ ఎక్స్పరిమెంటల్ ఎస్టాబ్లిష్మెంట్(PXE) 50 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిప్లొమా, బీటెక్, బీఈ అర్హత గలవారు ఈనెల 19 వరకు training.pxe@gov.in మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్లో ఎన్రోల్ చేసుకోవాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.drdo.gov.in
News October 18, 2025
ప్రభుత్వానికి ‘ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత’ ప్రతిపాదనలు

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేస్తూ ఇటీవల రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు పంచాయతీరాజ్ శాఖ సవరణకు చర్యలు చేపట్టింది. ఈ నిబంధన సవరించాలని కోరుతూ ప్రభుత్వానికి పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదనలు పంపింది. సర్కార్ ఆమోదం అనంతరం కొత్త సవరణలతో అధికారిక ఉత్తర్వులు రానున్నాయి. అటు BC రిజర్వేషన్ల అంశం తేలిన తర్వాత రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశముంది.