News September 30, 2024

నివాస ఇళ్లను హైడ్రా కూల్చదు: రంగనాథ్

image

TG: పేదలు, మధ్య తరగతి ప్రజల జోలికి హైడ్రా వెళ్లదని, ఇప్పటికే నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చదని కమిషనర్ రంగనాథ్ మరోసారి స్పష్టం చేశారు. అసత్య ప్రచారాలు నమ్మొద్దన్నారు. హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకేనని చెప్పారు. ప్ర‌కృతి వ‌న‌రుల ప‌రిర‌క్ష‌ణ‌, చెరువులు, కుంట‌లు, నాలాలను కాపాడ‌డం, వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల స‌మ‌యంలో ర‌హ‌దారులు, నివాస ప్రాంతాలు మునిగిపోకుండా చర్యలు చేపట్టడమే హైడ్రా పని అన్నారు.

Similar News

News December 10, 2025

గర్భంలోని బిడ్డకు HIV రాకూడదంటే..

image

హెచ్‌ఐవీ ఉన్న మహిళ గర్భం దాలిస్తే మాయ ద్వారా, రక్తం ద్వారా బిడ్డకి వైరస్‌ సంక్రమించే అవకాశం ఉంటుంది. ఇలాకాకుండా ఉండాలంటే వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడాలి. కాన్పు సమయంలో తల్లి నుంచి బిడ్డకి యోని ద్వారా వైరస్‌ సంక్రమించే అవకాశాలుంటాయి. కాబట్టి సీ సెక్షన్ చేయించడం మంచిది. పుట్టిన తర్వాత బిడ్డకు కూడా పరీక్ష చేయించి, ఆరు వారాల వరకు హెచ్‌ఐవీ మందులు వాడటం వల్ల వైరస్‌ బిడ్డకు సోకి ఉంటే నాశనమవుతుంది.

News December 10, 2025

ఇతిహాసాలు క్విజ్ – 92 సమాధానం

image

ఈరోజు ప్రశ్న: గణపతి, కార్తీకేయ సోదరులను ముల్లోకాలు చుట్టిరమ్మనే పరీక్ష శివుడు ఎందుకు పెట్టాడు?
సమాధానం: ప్రమథగణాలకు నాయకత్వం వహించడానికి అర్హులెవరో నిర్ణయించడానికి శివుడు ఈ పరీక్ష పెట్టాడు. కార్తికేయుడు లోకాలు చుట్టడానికి వెళ్లగా, గణపతి శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణ చేసి తల్లిదండ్రులే సకల లోకాలు అని నిరూపించాడు. అలా వినాయకుడు సకల కార్యాలలో తొలి పూజలు అందుకునే వరాన్ని అనుగ్రహించాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>

News December 10, 2025

పంచాయతీ ఎన్నికలు.. స్కూళ్లకు రేపు సెలవు

image

తెలంగాణలో రేపు తొలి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. 3,800 గ్రామాల్లో సర్పంచ్, వార్డుల సభ్యులను ఎన్నుకోనున్నారు. దీంతో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన స్కూళ్లకు విద్యాశాఖ అధికారులు రేపు సెలవు ప్రకటించారు. ఆయా స్కూళ్లకు ఇవాళ కూడా హాలిడే ఉంది. తర్వాత జరిగే 2 విడతల పోలింగ్ నేపథ్యంలో ఈ నెల 13,14(ఆదివారం),16,17న కూడా స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి.