News August 24, 2024
హైడ్రా పేరుతో హైడ్రామా నడుస్తోంది: కిషన్ రెడ్డి

TG: N కన్వెన్షన్ కూల్చివేతపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ‘హైడ్రా పేరుతో హైడ్రామా నడుస్తోంది. గతంలో అనుమతి ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలు మొదలుపెట్టింది. ఇన్నాళ్లూ విద్యుత్, నీటి సదుపాయం ఎలా కల్పించారు? అక్రమ నిర్మాణాలకు రోడ్లు ఎందుకు వేశారు? ఏ చర్యలైనా, చట్టమైనా అందరికీ సమానంగా వర్తింపజేయాలి. అనుమతులు ఇచ్చినవారిపైనా చర్యలు తీసుకోవాలి’ అని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Similar News
News December 16, 2025
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,520 తగ్గి రూ.1,33,860కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,400 పతనమై రూ.1,22,700 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.4,000 తగ్గి రూ.2,11,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 16, 2025
EVMలతోనే 4 సార్లు గెలిచా: సుప్రియా సూలే

EVMలపై ప్రతిపక్షాలు రిగ్గింగ్ ఆరోపణలు చేస్తున్న వేళ NCP(SP) ఎంపీ సుప్రియా సూలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాటితోనే తాను 4 సార్లు లోక్సభకు ఎన్నికయ్యానని, అందుకే ఎటువంటి అనుమానాలు లేవని చెప్పారు. LSలో ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. EVMలు, VVPATలను ప్రశ్నించాల్సిన అవసరం లేదన్నారు. మరోవైపు EVMలను దేశంలో ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని హోంమంత్రి అమిత్ షా గుర్తుచేశారు.
News December 16, 2025
నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. ప్రారంభ సమయంలో Sensex సుమారు 300 పాయింట్లు పడిపోయి 84,900 స్థాయికి దిగివచ్చింది. Nifty కూడా 100 పాయింట్లకు పైగా నష్టపోయి 25,950 కంటే దిగువకు చేరింది. బ్యాంకింగ్, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. సోమవారం కూడా మార్కెట్లు నష్టాల్లోనే కూరుకుపోగా.. ఈరోజూ అదే ధోరణి కొనసాగుతోంది. ట్రేడింగ్ కొనసాగుతున్న కొద్దీ మార్కెట్ దిశపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


