News November 24, 2024

త్వరలో పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైళ్లు

image

భార‌త్‌లో మొద‌టి హైడ్రోజ‌న్ రైలు డిసెంబ‌ర్‌లో ప‌ట్టాలెక్క‌నుంది. ఈ ప‌ర్యావ‌ర‌ణ అనుకూల రైలును హ‌రియాణాలో 90KM దూరం క‌లిగిన జింద్-సోనిపట్ మ‌ధ్య న‌డ‌ప‌నున్నారు. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకొని నీటి ఆవిరిని విడుదల చేయడం దీని ప్రత్యేకత. ఇతర రైళ్లతో పోలిస్తే ఇవి తక్కువ శబ్దంతో నడుస్తాయి. 2025 నాటికి ఇలాంటి 35 రైళ్లను పట్టాలెక్కించడానికి రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది.

Similar News

News November 24, 2024

విద్యార్థుల జీవితాలతో సర్కార్ చెలగాటం: జగన్

image

AP: ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకుండా కూటమి సర్కార్ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. విద్యార్థులపై చంద్రబాబు కక్షగట్టారని ఆయన విమర్శించారు. ‘అమ్మఒడి, ఇంగ్లిష్ మీడియం, టోఫెల్, ట్యాబులు, బైజూస్ కంటెంట్, నాడు-నేడును బాబు రద్దు చేశాడు. వైసీపీ హయాంలో తల్లుల ఖాతాలకే వసతి, విద్యా దీవెన జమ చేసేవాళ్లం. ఇప్పుడు అది కూడా లేకుండాపోయింది’ అని ఆయన ఫైర్ అయ్యారు.

News November 24, 2024

KCR స్ఫూర్తితో ఈనెల 29న దీక్షా దివస్: KTR

image

తెలంగాణ ఉద్యమంలో ఉన్న నిర్బంధాలు ఇప్పుడు మళ్లీ కనిపిస్తున్నాయని, మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన అవసరం ఉందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. ‘2009 నవంబర్ 29న KCR దీక్ష చేపట్టారు. ఇప్పుడు మళ్లీ ఆయన స్ఫూర్తితో అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో దీక్షా దివస్ నిర్వహిస్తాం. అదేరోజు నిమ్స్‌లో అన్నదానం చేస్తాం. డిసెంబర్ 9న మేడ్చల్‌లో తెలంగాణ తల్లికి ప్రణమిల్లే కార్యక్రమం చేపడతాం’ అని KTR తెలిపారు.

News November 24, 2024

నా వ్యక్తిత్వాన్ని మార్చుకోలేను: అభిషేక్ బచ్చన్

image

ఐశ్వ‌ర్యరాయ్‌తో విడాకులు వంటి నెగెటివ్ ప్ర‌చారాన్ని హ్యాండిల్ చేయ‌డంపై అభిషేక్ బ‌చ్చ‌న్ స్పందించారు. ‘వ్య‌క్తిగా మ‌నం ఏంట‌న్న‌ది స్థిరంగా ఉండాలి. ప‌రిస్థితుల‌కు తగ్గట్టుగా ముందుకెళ్లాలి. లేక‌పోతే వెనుక‌బ‌డిపోతాం. కానీ మ‌న‌ మౌలిక విలువలు మారకూడదు. చెడు దాని స్వభావాన్ని మార్చుకోనప్పుడు, మంచి మాత్రం ఎందుకు మార్చుకోవాలి? నేను నా వ్యక్తిత్వాన్ని మార్చుకోలేను’ అని పేర్కొన్నారు.