News February 4, 2025
HYDలో 2 రెట్లు మించిన గాలి కాలుష్యం

ఒక ఘనపు మీటర్ గాలిలో (సూక్ష్మ ధూళికణాలు) పీఎం10 స్థాయి 45 గ్రాములు మించి ఉండొద్దు. కానీ.. HYDలో 2.11 రేట్లు అంటే 95 గ్రాములకు పైగా నమోదవుతున్నట్లు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ HYD వెల్లడించింది. హోటళ్లలో కట్టెల పొయ్యిలు ఉపయోగించడం, 15 ఏళ్లకుపైగా వాహనాలు రోడ్డెక్కడం, చెత్తను కాల్చడం, ఇంధనాలు, కల్తీ, దుమ్మూ కాలుష్యం, వాహనాలు వల్ల జరుగుతున్నట్లు కారణంగా చెప్పుకొచ్చింది.
Similar News
News March 15, 2025
గాజువాకలో బాలికపై అత్యాచారయత్నం..!

గాజువాకలో మైనర్‌పై అత్యాచారయత్నం కలకలం రేపింది. డ్రైవర్స్ కాలనీలో పదేళ్ల బాలికపై దాడి భాను ప్రకాష్ అనే వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. బాలిక తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయంలో మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడిగడ్డాడు. తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన ఘటన గురించి చిన్నారి వారికి చెప్పింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో భాను ప్రకాష్‌ని గాజువాక పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
News March 15, 2025
ధన్వాడ: చిరుత దాడిలో దూడ మృతి.!

చిరుత దాడిలో లేగదూడ మృతి చెందిన ఘటన NRPT జిల్లా ధన్వాడ మండలంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలానికి చెందిన రైతు చెట్టుకింది కథలప్ప పొలంలో శుక్రవారం రాత్రి లేగదూడపై చిరుత దాడి చేయడంతో మృతి చెందింది. సుమారు రూ.60 వేలు నష్టం వాటిలినట్లు రైతు తెలిపారు. శనివారం ఉదయం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మల్లేశ్ ఘటన ప్రదేశాన్ని పరిశీలించి చిరుత దాడి జరిగినట్లు నిర్ధారించారు.
News March 15, 2025
కాంగ్రెస్ పాలన దేశ చరిత్రలోనే మాయని మచ్చ: కేటీఆర్

కాంగ్రెస్ పాలనపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ట్విటర్లో విరుచుకుపడ్డారు. ‘సంపద సృష్టిస్తాం, ప్రజలకు పంచుతాం అని ప్రగల్భాలు పలికారు. 15 నెలల పాలనలో ఊదు కాలింది లేదు. పీరు లేచింది లేదు. రూ.1.50 లక్షల కోట్లు అప్పు తెచ్చినట్లు ప్రభుత్వమే అధికారికంగా ఒప్పుకుంది. రుణమాఫీ, రైతుభరోసా, సాగునీళ్లు, పంటల కొనుగోళ్లు ఏవీ లేవు. కాంగ్రెస్ పాలన దేశ రాజకీయ చరిత్రలోనే మాయని మచ్చ’ అని పేర్కొన్నారు.