News March 21, 2025
HYDలో అడవిని సృష్టించలేం.. కానీ..!

మన HYDలో అడవిని సృష్టించలేము. కానీ, ప్రయత్నం చేద్దాం. ‘రాజధాని’ కాంక్రిట్ జంగిల్‌గా మారడంతో గల్లీ గల్లీకి సీసీ రోడ్డు వస్తున్నాయే తప్పా.. ఓ మొక్క నాటడానికి జాగ దొరుక్తలేదు. హరితహారం, వన మహోత్సవం అంటూ ప్రభుత్వాలు గొప్ప పనే చేస్తున్నాయి. కానీ, సామాజిక బాధ్యతగా చెట్లను రక్షించాల్సిన మనం ఏం చేస్తున్నాం? అసలే ఎండకాలం. నీడనిచ్చే చెట్లను కాపాడుకుందాం.
నేడు ప్రపంచ అటవీ దినోత్సవం.
SAVE TREES.
Similar News
News March 29, 2025
రుద్రవరంలో మరోసారి భానుడి విశ్వరూపం.!

నంద్యాల జిల్లాలో కొద్ది రోజులుగా భానుడు తన విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) గణాంకాల ప్రకారం శనివారం నంద్యాల(D) రుద్రవరంలో రాష్ట్రంలోనే 43.5°C, కర్నూలు(D) ఉలిందకొండలో 42.4°C ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, గత కొద్దిరోజులుగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో అధిక ఉష్ణోగ్రత నమోదవుతుండటం గమనార్హం.
News March 29, 2025
టాస్ గెలిచిన ముంబై

IPL: GTతో మ్యాచులో ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
MI: రోహిత్, రికెల్టన్, సూర్య, తిలక్ వర్మ, హార్దిక్(C), నమన్ ధీర్, శాంట్నర్, దీపక్ చాహర్, బౌల్ట్, ముజీబ్, సత్యనారాయణ రాజు.
GT: గిల్(C), బట్లర్, సాయి సుదర్శన్, రూథర్‌ఫర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, సాయి కిశోర్, రషీద్ ఖాన్, రబాడ, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
News March 29, 2025
సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలను అభివృద్ది చేయాలి: కలెక్టర్

సంక్షేమ వసతి గృహాల నిర్వహణ విషయంలో హేతుబద్ధీకరణ కలిగి ఉండాలని, మౌలిక వసతులకు సంబంధించిన పనులు నిర్ణిత సమయంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంతి స్పష్టం చేశారు. శనివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంక్షేమ శాఖల అధికారులతో కలెక్టరు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలను హేతుబద్ధీకరణ విధానంలో అభివృద్ధి చేయాలని కోరారు.