News April 3, 2025
HYDలో ‘అతిథి దేవోభవ’ కరవు!

అతిథి దైవ సమానం. కానీ, తాజా ఘటనతో పరువు పోయింది. జర్మనీ యువతికి HYD చూపిస్తానని నమ్మించిన యువకుడు అత్యాచారం చేసి, ఆమె జీవితంలో మాయనిమచ్చను మిగిల్చాడు. గతంలో ఓ ఫారినర్‌కు వ్యాపారి రూ.100కు ఒక్క అరటి పండు అంటగట్టాడు. ఇది అన్యాయమని ఆ టూరిస్ట్ వీడియో వైరల్ చేశాడు. వాస్తవానికి HYD మతసామరస్యానికి నిలువుటద్దం. గొప్ప వారసత్వ సంపద ఉన్న నగరం. లక్షల మందికి ఉపాధినిస్తోంది. అలాంటి చోట ‘అతిథి దేవోభవ’ ఆచరించండి.
Similar News
News April 4, 2025
నాటుసారా నిర్మూలనకు కృషి చేయాలి- జేసీ

బాపట్ల జిల్లాలో నాటుసారా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లో నాటు సారా నిర్మూలన జిల్లా స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రఖర్ జైన్ మాట్లాడుతూ.. జిల్లాలో నాటుసారా తయారు చేసే గ్రామాలను గుర్తించాలన్నారు. నాటుసారా ఆరోగ్యానికి హానికరం అన్నారు.
News April 4, 2025
MIకి గుడ్‌న్యూస్.. త్వరలోనే బుమ్రా ఆగమనం?

ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. వెన్నెముక గాయంతో BGT సిరీస్ ఆఖరి మ్యాచ్‌లో ఆయన దూరమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రికవరీలోనే ఉన్న ఈ పేసర్ తిరిగి ఫిట్‌నెస్ సాధించినట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. మరో రెండు మ్యాచ్‌ల తర్వాత నుంచి ఆయన అందుబాటులోకి రానున్నారని తెలిపాయి. ఈలోపు తుది దశ ఫిట్‌నెస్ టెస్టుల్లో పాల్గొంటారని సమాచారం.
News April 4, 2025
సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తాం: ఎస్పీ

విజయనగరం జిల్లా పోలీసుశాఖలో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం “పోలీసు వెల్ఫేర్ డే” నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరిని తన ఛాంబర్‌లోకి పిలిచి, వారి వ్యక్తిగత, వృత్తిపరమైన, శాఖాపరమైన సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వారి నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు.