News December 25, 2024

HYDలో అర్ధరాత్రి నుంచి సంబరాలు

image

హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుంచి పండుగ వాతావరణం నెలకొంది. యేసు పుట్టిన రోజు సందర్భంగా అన్ని చర్చిలను అందంగా అలంకరించారు. స్టార్ ఆకారంలో పలుచోట్ల LED లైట్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో సెక్రటేరియట్, ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌ రోడ్‌లో క్రిస్‌మస్ ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అయితే, మిడ్ నైట్ 12 గంటలకు చర్చిలకు వెళ్లిన క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Happy Christmas

Similar News

News December 26, 2024

HYD: ఊసరవెల్లితో కాంగ్రెస్ నాయకుల పోటీ: ఎంపీ లక్ష్మణ్

image

ప్రస్తుతం రాజకీయాల్లో నాయకులు ఎప్పటికప్పుడు రంగులు మారుస్తున్నారని, అలాంటి రంగులు మార్చే నాయకులతో ఊసరవెల్లి కూడా సిగ్గుతో తలదించుకుంటుందని రాజ్యసభ సభ్యుడు, BJP ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి విమర్శించారు. నాంపల్లి BJP రాష్ట్ర కార్యాలయంలో బుధవారం వాజ్ పేయి జయంతి సందర్భంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వాజ్ పేయి విలువలతో కూడిన వ్యక్తి అని కొనియాడారు.

News December 26, 2024

నేడు హైదరాబాద్‌కు ఏపీ సీఎం చంద్రబాబు

image

ఏపీ సీఎం చంద్రబాబు గురువారం హైదరాబాద్ రానున్నారు. ఇవాళ ఢిల్లీలో పర్యటించిన చంద్రబాబు నాయుడు.. ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులను విడుదల చేయాలని కోరారు. ఇవాళ రాత్రికి అక్కడే బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం 9గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరి హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం టీడీపీ మంత్రి టీజీ భరత్ కుమార్తె వివాహానికి హాజరుకానున్నారు.

News December 26, 2024

HYD: పుష్ప-2 తొక్కిసలాట.. నిఘాలో ‘సంధ్య థియేటర్’

image

HYD RTC క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో ఇటీవల తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో థియేటర్ యజమానులు కీలక నిర్ణయం తీసుకున్నారు. థియేటర్ లోపల, బయట పూర్తిగా మరమ్మతులు ప్రారంభించారు. పాత సీసీ కెమెరాలను తొలగించి, వాటి స్థానంలో అధునాతనమైన కొత్త సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక నుంచి సంధ్య 70MM, 35MM థియేటర్ల గేట్లకు బోర్డులు, కొత్త గ్రిల్స్‌, మెటల్ డిటెక్టర్లు, ఫైర్ సేఫ్టీ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.