News March 23, 2024
HYDలో ఆక్రమణలు.. చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
నగరంలో నీటి వనరుల ఆక్రమణలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. బుద్ధభవన్‌లోని EVDM కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. GHMC పరిధి చెరువుల వద్ద FTC, బఫర్ జోన్ బౌండరీలకు సంబంధించిన మ్యాపులను ప్రదర్శించాలని సూచించారు. చెరువు బఫర్ జోన్‌లో నిర్మించే భవనాలను గుర్తించి తక్షణమే నోటీసులు ఇవ్వాలని స్పష్టం చేశారు.
Similar News
News January 7, 2025
ఎస్సీ వర్గీకరణ అమలుకు కృషి చేస్తా: AICC సెక్రెటరీ
AICC సెక్రెటరీ సంపత్ కుమార్‌ను మంద కృష్ణ మాదిగ కలిశారు. ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలు చేయించాలని సంపత్‌ని కోరారు. చేవెళ్ల డిక్లేరేషన్, అసెంబ్లీలో CM రేవంత్ చేసిన ప్రకటనకు అనుగుణంగా వర్గీకరణను త్వరగా అమల్లోకి తీసుకొచ్చేలా కృషి చేయాలన్నారు. వేల గొంతులు-లక్షల డప్పుల కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు. వర్గీకరణ పూర్తవడానికి తన వంతు కృషి చేస్తానని సంపత్ హామీ ఇచ్చారని కృష్ణ తెలిపారు.
News January 7, 2025
క్రీడలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం: CM
క్రీడలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి HYDలోని సీఎం నివాసంలో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి 68వ ఎస్జీఎఫ్ఐ అండర్-17 బాలబాలికల జాతీయ హ్యాండ్ బాల్ ఛాంపియన్షిప్ పోటీల పోస్టర్‌ను సీఎం ఆవిష్కరించారు. ఈ పోటీలు ఈనెల 10 నుంచి 14 వరకు మహబూబ్‌నగర్ జిల్లా మైదానంలో ప్రారంభం కానున్నాయి.
News January 7, 2025
HYD: నిర్లక్ష్యం వద్దు.. మళ్లీ మాస్కు ధరించండి
hMPV వైరస్ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో HYD పరిధిలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రజలకు కీలక విజ్ఞప్తి చేసింది. నమస్కారం ముద్దు – హ్యాండ్‌షేక్ వద్దు’ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. షేక్ హ్యాండ్స్ కారణంగా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. మాస్క్, శానిటైజర్ తప్పనిసరి అని తెలిపింది.