News May 11, 2024

HYDలో కరెంట్ కట్.. KCR ఫైర్

image

HYDలో కరెంట్ కోతల విషయమై కాంగ్రెస్ ప్రభుత్వంపై KCR మండిపడ్డారు. ఈరోజు తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. మొన్న వర్షం కురిస్తే కొన్ని ప్రాంతాల్లో 6 నుంచి 8 గంటలు కరెంట్ కట్ చేశారని, చందానగర్‌లోనైతే 24 గంటలు కరెంట్ కట్ చేస్తే ప్రజలు సబ్‌స్టేషన్‌కి వెళ్లి ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఐటీ కేంద్రమైనా HYD బ్రాండ్ ఇమేజ్‌ను కాంగ్రెసోళ్లు చెడగొట్టొద్దని కోరారు.

Similar News

News January 24, 2025

HYD: ఇన్‌స్టాలో అశ్లీల వీడియోలు.. ARREST

image

ఇన్‌స్టాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి చిన్నారుల అశ్లీల నృత్యాలు షేర్ చేసిన HYD వాసులు అరెస్ట్ అయ్యారు. ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగులు, ఓ వ్యాపారి పోర్న్ చూస్తున్నారు. చిన్నారుల అశ్లీల వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. గుర్తించిన NCMEC(National Center for Missing & Exploited Children) సైబర్ క్రైమ్‌ PSలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని గురువారం అరెస్ట్ చేశారు.

News January 24, 2025

హైదరాబాద్‌లో చికెన్ ధరలు‌

image

హైదరాబాద్‌లో చికెన్ ధరలు‌ కొండెక్కాయి. గత నెల రోజులుగా KG రూ. 200కు పైగానే అమ్ముతున్నారు. స్కిన్‌లెస్ రూ. 245 నుంచి రూ. 250 మధ్య విక్రయిస్తున్నారు. విత్ స్కిన్ రూ. 215 నుంచి రూ. 230 మధ్య అమ్మకాలు జరుపుతున్నారు. శుక్రవారం ఫాంరేట్ KG రూ. 127, రిటైల్ KG రూ. 149‌గా నిర్ణయించారు. మీ ఏరియాలో‌ ధరలు ఏ విధంగా ఉన్నాయి.
SHARE IT

News January 23, 2025

డిజిటల్ భద్రత కోసం రాచకొండ పోలీసుల సూచనలు

image

డిజిటల్ గుర్తింపును రక్షించుకోవడం అత్యంత ప్రాముఖ్యమని రాచకొండ పోలీసులు సూచించారు. బయోమెట్రిక్ OR 2FA వంటి 2తరగతుల భద్రతను ఉపయోగించి అకౌంట్లను రక్షించుకోవాలన్నారు. ప్రత్యేకమైన, బలమైన పాస్‌వర్డ్‌లు సృష్టించాలని తెలిపారు. మీ డిజిటల్ హెల్త్‌ను క్రమం తప్పకుండా పరిశీలించాలన్నారు. గూగుల్‌లో మీ వివరాలను చెక్ చేసి, ఉపయోగించని అకౌంట్లను తొలగించాలని(OR)1930లో సంప్రదించాలన్నారు.