News March 28, 2025
HYDలో తగ్గిన ఇళ్ల కొనుగోళ్లు: KTR

హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో HYDలో ఇళ్ల కొనుగోళ్లు తగ్గాయని KTR Xలో ఆరోపించారు. పేదల ఇళ్లమీదకు బుల్డోజర్‌లు పంపి పెద్దలతో సెటిల్‌మెంట్లు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.‘గత త్రైమాసికంలో 49% ఇళ్ల విక్రయాలు తగ్గాయి. ఆఫీస్‌ల లీజింగ్ కూడా పాతాళానికి పడిపోయింది. ఈ ఏడాది 3 నెలల్లో కొనుగోళ్లు 41% తగ్గాయి. ప్రభుత్వం అబద్ధాలు మాని అభివృద్ధి చేయాలి, కూల్చడం కాదు, కట్టడం నేర్చుకోవాలి’ అని రాసుకొచ్చారు.
Similar News
News April 2, 2025
మామునూరు: GREAT.. గ్రూప్-1 ఆఫీసర్‌గా వాచ్‌మెన్ కుమారుడు

వరంగల్ జిల్లాకు చెందిన వాచ్‌మెన్ కుమారుడు గ్రూప్-1 ఆఫీసర్‌గా ఎంపికయ్యాడు. మామునూరుకు చెందిన జయ-రవికుమార్ దంపతుల కుమారుడు రాహుల్ ఇటీవల TGPSC విడుదల చేసిన గ్రూప్1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌లో 555వ ర్యాంక్, మల్టీ జోన్-1 SC కేటగిరీలో 23వ ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. 2023-2024లో టీజీపీఎస్సీ నిర్వహించిన ఏవో, జేఏఓ ఎగ్జామ్‌లో రాహుల్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్(జేఏఓ)గా ఎన్నికయ్యారు.
News April 2, 2025
2 ఉద్యోగాలు సాధించిన వాంకిడి వాసి శివప్రసాద్

వాంకిడి మండలానికి చెందిన బెల్లాల రమేశ్, తార దంపతుల తనయుడు శివ ప్రసాద్ రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి సత్తాచాటారు. గత సంవత్సరం ఏపీజీబీలో జాబ్ చేస్తూ నిన్న వెలువడిన ఐబీపీఎస్ ఫలితాల్లో ఇండియన్ బ్యాంక్ క్లర్క్‌గా ఎంపికయ్యాడు. తల్లిదండ్రులు,గురువుల ప్రోత్సాహంతో ఇది సాధ్యమైందని శివప్రసాద్ తెలిపారు.
News April 2, 2025
నల్గొండ: రోడ్డుపై కారుతో స్టంట్స్.. యువకుడి అరెస్ట్

నల్గొండ నాగార్జున డిగ్రీ కళాశాల రోడ్డు పై షిఫ్ట్ డిజైర్ కార్‌తో స్టంట్స్ చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డుపై వేగంగా స్టంట్స్ చేయడంతో ప్రజలు భయాందోనకు గురయ్యారు. గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ విజయ్ కారును పట్టుకునే ప్రయత్నం చేయగా సదరు యువకుడు కానిస్టేబుల్‌ను కారుతో భయపెట్టి పరారయ్యాడు. కాగా విషయం తెలుసుకున్న 2 టౌన్ పోలీసులు సాయంత్రం అతడిని అరెస్ట్ చేశారు.