News June 23, 2024
HYDలో మరో MURDER..?
గుర్తుతెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన HYD చందానగర్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. చందానగర్ హుడాకాలనీ సాయిబాబా ఆలయం ఆనుకొని ఉన్న నిర్జన ప్రదేశంలో మహిళ(40) మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పరిశీలించగా గొంతు నులిమి ఆమెను హత్య చేసినట్లుగా అనుమానించారు. మృతురాలి ఎడమ చేతిపై బాలయ్య అనే పచ్చబొట్టు ఉందని తెలిపారు. కేసు నమోదు చేశారు.
Similar News
News January 3, 2025
HYD: మూసీ పొల్యూషన్..12 ప్రాంతాల గుర్తింపు..!
మూసీ పరివాహాక ప్రాంతాన్ని ప్రక్షాళన చేసిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రికార్డుల ప్రకారం మొత్తం 12 హాట్ స్పాట్ కాలుష్య ప్రాంతాలను గుర్తించింది. HYD-2,MDCL-1,RR-2, యాదాద్రి-3, సూర్యాపేట-2, నల్గొండ-2 ఉన్నట్లుగా తెలిపింది. అంటే HYD బయట నుంచి వచ్చే పరిశ్రమలతో మూసీ కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నట్లు గుర్తించింది. త్వరలోనే లిస్టు విడుదల చేస్తామని పేర్కొంది.
News January 3, 2025
HYD: తెలంగాణ భవన్‌లో సావిత్రిబాయి ఫూలే జయంతి
HYD బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌లో నేడు సావిత్రిబాయి ఫూలే జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా MLC మధుసూదనా చారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి ఫూలే సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. విద్యను బలోపేతం చేసేందుకు ఆమె చేసిన త్యాగాలను గుర్తుచేశారు. BRS నాయకులు పాల్గొన్నారు.
News January 3, 2025
HYDలో పెళ్లి ఖర్చుకు వెనకాడట్లే..!
హైదరాబాద్‌లో రోజురోజుకు పెళ్లిళ్ల ఖర్చు అమాంతం పెరుగుతోంది. ఓ సర్వే ప్రకారం వివాహ ఖర్చు నగరంలో రూ.30 లక్షల నుంచి రూ.కోటికి పైగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రతి ఏడాదికి దాదాపు 30% పెరుగుతోందని కాన్ఫరెన్స్ ట్రేడర్స్ సర్వే తెలిపింది. పెళ్లి ఖర్చుకు సంపన్నులు సహా, మధ్యతరగతి వారు సైతం వెనకాడటం లేదని పేర్కొంది.