News May 5, 2024

HYDలో రికార్డ్ బ్రేక్.. 90.68 మి.యూ విద్యుత్ వినియోగం

image

గ్రేటర్ HYDలో రికార్డ్ స్థాయి విద్యుత్ వినియోగం నమోదైనట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మే 4న 90.68 మిలియన్ యూనిట్లకు దాటినట్లు పేర్కొన్నారు. 2023లో ఇదే రోజు 59.98 మిలియన్ యూనిట్లు మాత్రమే నమోదయిందని, కానీ.. ఈ ఏడాది దాదాపు 51 శాతం అధికంగా విద్యుత్ వినియోగం నమోదయినట్లు వెల్లడించారు. ఈ వేసవిలో ఎంత డిమాండైనా తట్టుకునేనుందుకు విద్యుత్ శాఖ సిద్ధంగా ఉందన్నారు.

Similar News

News October 2, 2024

HYD: చిన్ననాటి స్నేహితుడే చంపేశాడు!

image

దీప్తి శ్రీనగర్ సీబీఆర్ ఎస్టేట్‌లో సోమవారం జరిగిన హత్య కేసును మియాపూర్ పోలీసులు ఛేదించారు. భర్తతో విడిపోయిన స్పందన (29) అమ్మ, తమ్ముడితో కలిసి ఉంటోంది. సోమవారం హత్యకు గురి కావడంతో పోలీసులు ఆధారాలు సేకరించారు. చిన్ననాటి క్లాస్మేట్ బాలు హత్య చేసినట్లు గుర్తించారు. మృతురాలు భర్తతో విడిపోవడంతో ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని ప్రయత్నించగా ఒప్పుకోకపోవడంతో దాడి చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడన్నారు.

News October 2, 2024

HYD: దుర్గామాత మండపాలు.. అనుమతి తప్పనిసరి!

image

HYDలో దుర్గామాత మండపాలు ఏర్పాటు చేసేందుకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. https://policeportal.tspolice.gov.in/index.htm లింక్ ద్వారా దరఖాస్తు చేసుకొని, సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో అప్లికేషన్ ఫారంని సబ్మిట్ చేయాలని స్పష్టం చేశారు. మండపం ఎత్తు, నిమజ్జనం, నిర్వాహకుల సమాచారం అందులో పొందుపర్చాలి.
SHARE IT

News October 2, 2024

HYD: మహనీయులకు నివాళులర్పించిన బీఆర్ఎస్ అగ్రనేతలు

image

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పార్టీ అగ్రనాయకులతో మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రీలకు తెలంగాణ భవన్లో నివాళులర్పించారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, మహమూద్ అలీ, పార్టీ నాయకులు, సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, మాగంటి గోపీనాథ్ తదితర ప్రముఖులతో కలిసి ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని తెలిపారు.