News April 6, 2025
HYDలో రేపు మొత్తం వైన్స్ బంద్..!

శ్రీరామనవమిని పురస్కరించుకుని HYD నగరంలోని ట్రై కమిషనరేట్లు HYD, సైబరాబాద్, రాచకొండ పరిధిలో రేపు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్స్ బంద్ ఉంటాయని అధికారులు తెలిపారు. రాచకొండ పోలీసులు నిన్ననే చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా HYD, సైబరాబాద్ పోలీసులు సైతం వెల్లడించారు. కల్లు దుకాణాలు, రెస్టారెంట్ల అనుబంధ బార్లు, మిలిటరీ క్యాంటీన్లు, స్టార్ హోటల్లు, రిజిస్టర్ క్లబ్లలోనూ బంద్ ఉంటాయన్నారు
Similar News
News April 7, 2025
సిద్దిపేట: రాయితీని సద్వినియోగం చేసుకోవాలి:కలెక్టర్

ఎల్ఆర్ఎస్ 25 శాతం రిబేట్ అవకాశం ఈనెల 31 వరకు ప్రభుత్వం పొడిగించినందున లబ్ధిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరీమ అగ్రవాల్‌తో కలిసి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి ఎల్ఆర్ఎస్, రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు, తాగునీటిపై సమీక్ష నిర్వహించారు.
News April 7, 2025
ఆ రోజు నుంచి బస్సులు బంద్: RTC JAC

TGSRTCలో సమ్మె సైరన్ మోగింది. మే 6 నుంచి సమ్మెకు దిగుతున్నట్లు RTC JAC వెల్లడించింది. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఇచ్చిన సమ్మె నోటీసులపై యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో స్ట్రైక్ చేపడతామని ప్రకటించింది. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని JAC నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాగా RTCలో కొత్త నియామకాలు, బకాయిలు, కారుణ్య నియామకాలు సహా పలు డిమాండ్లు పరిష్కరించాలని ఉద్యోగులు కోరుతున్నారు.
News April 7, 2025
సంగారెడ్డి: పాలిసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఈనెల 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ జానకి దేవి సోమవారం ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు అర్హులని చెప్పారు. దరఖాస్తులను www.polycet.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.