News February 19, 2025
HYDలో వ్యభిచారం.. పోలీసుల ఫోకస్

గ్రేటర్‌లో హ్యుమాన్ ట్రాఫికింగ్‌పై సైబరాబాద్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. విశ్వసనీయ సమాచారంతో వ్యభిచార గృహాలపై మెరుపుదాడులు చేస్తున్నారు. కూకట్‌పల్లిలో వాహనదారులకు సైగలు చేస్తూ వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతున్న ఏడుగురు మహిళలను మంగళవారం బైండోవర్ చేశారు. గత కొద్ది రోజులుగా KPHB మెట్రో సమీపంలోనూ నిఘా పెట్టారు. వ్యభిచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Similar News
News February 21, 2025
HYD: దాడి కేసులో నిందితుడికి ముగిసిన పోలీసు కస్టడీ

చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై ఇటీవల దాడి జరిగిన విషయం తెలిసిందే. రంగరాజన్‌పై దాడి కేసులో నిందితుడు వీరరాఘవరెడ్డికి పోలీసు కస్టడీ ముగిసింది. 3 రోజులపాటు కస్టడీలో పోలీసులు వీరరాఘవ రెడ్డిని విచారించారు. కస్టడీ ముగియడంతో నిందితుడిని రాజేంద్రనగర్ కోర్టులో హాజరు పరిచి.. ఆపై చంచల్‌గూడ జైలుకి తరలించారు. కాగా.. నిందితుడు తెలుగు రాష్ట్రాల్లోని 6 ప్రధాన ఆలయాలకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
News February 21, 2025
షాద్‌నగర్: మమ్మల్ని తిడితే కృష్ణా నీళ్లు రావు: మాజీ ఎమ్మెల్యే

మాజీ మంత్రి హరీశ్‌రావు కృష్ణాజలాలపై ప్రశ్నిస్తే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రపాలకులతో కలిసి కాంగ్రెస్ తెలంగాణ నేతలు ఈ ప్రాంతానికి అన్యాయం చేశారన్నారు. మమ్మల్ని తిడితే కృష్ణా నీళ్లు రావని కాంగ్రెస్ నేతలు గ్రహించాలని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.
News February 21, 2025
కీసర గుట్ట జాతర.. CM రేవంత్ రెడ్డికి ఆహ్వానం

మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కీసర గుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 24 నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు రావాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ ఇన్‌ఛార్జి తోటకూర వజ్రేశ్ యాదవ్ ఆధ్వర్యంలో CM రేవంత్ రెడ్డిని శుక్రవారం ఆయన నివాసంలో కలిసి ఆహ్వానించారు. కాగా ఇప్పటికే గుడి వద్ద భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.