News December 31, 2024

HYDలో సీరియల్ నటికి వేధింపులు.. కేసు నమోదు

image

సీరియల్ నటిని వేధించిన వ్యక్తిపై కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ పోలీసుల వివరాలు.. AP వెస్ట్ గోదావరికి చెందిన మహిళ(29) కృష్ణానగర్‌లో నివాసం ఉంటోంది. ఇటీవల ఓ సీరియల్‌ షూట్‌లో ఫణితేజతో ఆమెకు పరిచయం ఏర్పడింది. పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో అతడు అసభ్యకరమైన వీడియోలు పంపాడు. ఇతరులతో దిగిన ఫొటోలను వైరల్ చేస్తానని బెదిరించాడు. వేధింపులు తాళలేక బాధితురాలు జూబ్లీహిల్స్ PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

Similar News

News January 5, 2025

హైదరాబాద్ జిల్లా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా

image

HYD జిల్లా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. వెస్ట్ మారేడ్‌పల్లిలో 13℃, సులేమాన్‌నగర్ 13.7, షేక్‌పేట 13.8, ముషీరాబాద్ 14.2, కంటోన్మెంట్ 14.4, గోల్కొండ 14.6, లంగర్‌హౌస్ 14.6, ఆసిఫ్‌నగర్ 14.8, చాంద్రయాణగుట్ట 14.9, మోండామార్కెట్ 15.1, రియాసత్‌నగర్ 15.1, విజయనగర్‌కాలనీ 15.2, అహ్మద్‌నగర్ 15.7, గౌలివాడ 15.8, తిరుమలగిరి 15.9, జూబ్లీహిల్స్ 15.9, మెహదీపట్నం 16.2, పాటిగడ్డలో16.2℃గా నమోదైంది.

News January 5, 2025

సైబరాబాద్‌ను సురక్షితంగా మార్చాలి: CP

image

ప్రజా సమస్యలను సమర్థంగా పరిష్కరించేలా ప్రమాణాలు రూపొందించాలని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. మరింత ఉన్నత లక్ష్యాలను చేరుకోవడమే ధ్యేయంగా పనిచేయాలన్నారు. ప్రజలు సురక్షితంగా నివసించే ప్రాంతంగా సైబరాబాద్‌ను మార్చాలన్నారు.

News January 5, 2025

HYD: రైతుద్రోహి సీఎం: కేటీఆర్

image

మాజీమంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై Xలో మండిపడ్డారు. అక్కరకు రాని ఇందిరమ్మ భరోసా, రైతు భరోసాలో ప్రభుత్వం రైతునే కాంగ్రెస్ మాయం చేసిందన్నారు. మొక్కిన ఒక్క పథకం ఇయ్యని కాంగ్రెస్.. మోసానికి మారు పేరని పేర్కొన్నారు. ఢోకాలకు కేరాఫ్ కాంగ్రెస్ సర్కార్ అని రైతుద్రోహి సీఎం రేవంత్ అని రాసుకొచ్చారు.